![]() |
భుజంగాసనం :
పాముకు శరీరాన్ని ఎలా కావాలంటే అలా తిప్పుకొనే సౌకర్యం ఉంటుంది. పాము శరీరానికి ఉన్న లాభం మన శరీరానికి కూడా కలిగేలా చేస్తుంది భుజంగాసనం. రెండు చేతులనూ భూమికి ఆనించి, తలపైకెత్తి చూడాలి. వెన్నుపూసను కొద్దిగా వంచాలి.ప్రయోజనం :
మన శరీరానికి ఆధారం వెన్నుపూస. ఈ ఆసనం వేయడం వల్ల వెన్ను బలిష్టంగా తయారవుతుంది. వెన్నుపూస సమస్యలన్నీ తొలగిపోతాయి. వీపునొప్పి వెంటనే తగ్గిపోతుంది. మూల నాడులు, నాడీమండలం దృఢమవుతాయి. సెర్వికల్ నొప్పితో బాధపడే మహిళలకు ఈ ఆసనం ఎంతో ఉపయోగం.