![]() |
కరివేపాకు - కప్పు
ఎండుమిర్చి - 5
మినప్పప్పు - టేబుల్ స్పూన్
మెంతులు - చిటికెడు
చింతపండు - కొద్దిగా
బెల్లం తురుము- టీ స్పూన్
జీలకర్ర - అర టీ స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - టీ స్పూన్
తయారి:
పాత్రలో నూనె వేడయ్యాక జీలకర్ర చిటపటలాడించి, మినప్పప్పు గోధు మ రంగు వచ్చేవరకు వేయించాలి.
ఎండుమిర్చి, మెంతులు వరుసగా వేసి అర నిమిషం వేయించి తీసి చల్లార్చాలి.
చల్లారిన మిశ్రమంలో ఉప్పు, బెల్లం తురుము కలిపి గ్రైండ్ చేశాక చింతపండు జత చేసి మరోసారి తిప్పి తీయాలి.
ఇడ్లీ, దోశల్లోకి కరివేపాకు కారం అందిస్తే రుచిగా ఉంటుంది.