![]() |
కావలసిన పదార్థాలు:
అన్నం - 1 కప్పుతరిగిన ఉల్లిపాయలు - అర కప్పు
అల్లంవెల్లుల్లి పేస్టు -1 టీ స్పూను
మష్రూమ్స్ (చిన్న ముక్కలు) - అరకప్పు
టమేటో -1
గుడ్డు -1
కొత్తిమీర తరుగు - అరకప్పు
కారం - పావు టీ స్పూను
నిమ్మరసం - పావు టీ స్పూను
ఉప్పు - రుచికి తగినంత
నూనె - 1 టేబుల్ స్పూను.
తయారుచేసే విధానం:
కడాయిలో నూనెవేసి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు వేగాక మష్రూమ్స్ ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి. తర్వాత కారం, జీరా, ధనియా పొడులు, చాట్ మసాల, కొత్తిమీర, ఉప్పు వేసి నిమిషం తర్వాత గుడ్డు సొన వేయాలి. గుడ్డు పొడిపొడిగా అయ్యాక అన్నం వేసి అట్లకాడతో బాగా కలిపి నిమ్మరసం చల్లాలి. ఈ రైస్‌ని (చల్లారకుండా) వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.