![]() |
మైదా - పావు కేజీ
డాల్డా లేదా నెయ్యి - 50గ్రా
ఉప్పు - చిటికెడు
పనీర్ తురుము - 200 గ్రా
పచ్చి బఠాణీలు, లేదా నానబెట్టిన బఠాణీలు - 100 గ్రా
పచ్చిమిర్చి - 6
ఆవాలు - పావు టీ స్పూను
జీలకర్ర - పావు టీ స్పూను
ఉప్పు - తగినంత
మిరియాలపొడి - పావు టీ స్పూను
నూనె - వేయించడానికి తగినంత
తయారి:
జల్లించిన మైదాలో ఉప్పు, కరిగించిన డాల్డా వేసి బాగా కలపాలి. తరవాత నీరు పోసి చపాతీపిండిలా కలిపి మూత పెట్టాలి. రెండు చెంచాల నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక పచ్చిమిచ్చి తరుగు వేసి కొద్దిగా వేయించాలి. బఠాణీలు వేసి తడిపోయేవరకు వేయించాక, పనీర్ తురుము, తగినంత ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలిపి మరో ఐదునిమిషాలు వేయించాలి. మెత్తబడిన పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి. చాకుతో రెండు భాగాలుగా కట్ చేయాలి. ఒక భాగం తీసుకుని అంచులు తడిచేసి కోన్‌లా మడిచి చెంచాడు పనీర్ మిశ్రమాన్ని పెట్టి అంచులు విడిపోకుండా ఒత్తి వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.