వ్యాయామాలతో.. వ్యసనాలకు దూరం


కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌లాగా బాడీని సిక్స్‌ప్యాక్‌గా మలిచేందుకు పలువురు యువకులు రోజూ జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేస్తుంటారు. అందాల తార శిల్పాశెట్టి మాదిరిగా నాజుగ్గా తయారయ్యేందుకు కొందరు యువతులు జిమ్‌లో వ్యాయామాలు చేస్తున్నారు. వ్యాయామం చేస్తే తమ శరీరాన్ని అవసరమైన విధంగా మార్చుకోవచ్చని అందరికీ తెలిసిందే. కానీ మత్తుపదార్థాలు, మద్యం, సిగరెట్టు వంటి వ్యసనాలకు బానిసైనవారు ప్రతి రోజూ వ్యాయామం చేస్తే వీటి నుంచి బయటపడవచ్చని ఓ కొత్త సర్వేలో తేలడం విశేషం. ఆస్ట్రేలియాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆన్‌ డ్రగ్‌ అబ్యూజ్‌ ఈ సర్వేను నిర్వహించింది.

‘ప్రతి రోజు జిమ్‌కు వెళ్లి ఎక్సర్‌సైజులు చేస్తే శారీర కంగా, మానసికంగా ఉత్సాహంగా ఉండగల్గు తారు. ఫిజిక ల్‌గా ఫిట్‌గా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి’ అని ఫిట్‌నెస్‌ ఎక్స్‌పర్ట్‌లు చెబుతుంటారు. ప్రతిరోజు జిమ్‌కు వెళ్లి ఎక్సర్‌సైజులు చేస్తే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇటీవల ఓ కొత్త విషయం బయ టపడింది. ఆస్ట్రేలియాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆన్‌ డ్రగ్‌ అబ్యూజ్‌ ఛీప్‌ డాక్టర్‌ నోరా వాల్కోవ్‌ మత్తుపదార్థాలు, మద్యం, సిగరెట్లు తాగినవారిని ప్రతి రోజూ జిమ్‌లో ఎక్సర్‌ సైజులు చేయించి వారిపై సర్వే నిర్వహించారు. కొకైన్‌, మరిజువానా వంటి మత్తు పదార్థాల మూలంగా పలువురు యువతీ, యువకులు తమ ఆరోగ్యాలను పాడుచేసుకు న్నారు. ఇటువంటి వారు కొద్ది రోజులు ఎక్సర్‌సైజులు చేస్తే వారిలో దాదాపు సగం మంది మత్తు పదార్థాల వ్యసనం నుంచి కోలుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అనారో గ్యాల పాలైన వారిలో 40 శాతం మందికి ఆరోగ్యం మెల్లి, మెల్లిగా మెరుగైంది. 
వ్యసనాలకు విరుగుడుగా వ్యాయామం.....
మత్తుప దార్థాలు, మద్యం, సిగరెట్‌తో పాటు జంక్‌ ఫుడ్‌కు బాని సలైన వారికి ఎక్సర్‌సైజులే విరుగుడని తేలడం విశేషం. ‘ఇటీవల యువతీ,యువకులు పొగ తాగడం, మద్యం వం టి వ్యసనాలకు గురవుతున్నారు. వీరు జిమ్‌లకు వెళ్తూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరిస్తే వ్యసనాల నుంచి బయటపడడంతో పాటు తమ ఆరోగ్యాలను మెరుగుపర్చు కోవచ్చు’ అని డాక్టర్‌ నోరా వాల్కోవ్‌ పేర్కొన్నారు. డ్రగ్స్‌ బానిసలు రిహాబిలిటేషన్‌ సెంటర్లకు వెళ్లడంతో పాటు ప్రతి రోజు తప్పనిసరిగా ఎక్సర్‌సైజలు చేయాలని ఆయన సూచిస్తున్నారు. 
ఎక్సర్‌సైజుతో లైఫ్‌స్టైల్‌ మారుతుంది...
‘ప్రతి రోజు యువతీ,యువకులు ఎక్సర్‌సైజులు చేస్తూ హెల్దీ లైఫ్‌స్టైల్‌ దిశగా పయనించవచ్చు. డ్రగ్స్‌కు పూర్తిగా బానిసలై ఆత్మహత్యకు ప్రయత్నించిన పలువురు యువ తీ,యువకులు ఎక్సర్‌సైజుల ద్వారా కొత్త జీవితాన్ని పొంద వచ్చు’ అని వెల్‌నెస్‌ ఎక్స్‌పర్ట్‌ మిక్కీ మెహ్తా అన్నారు. వ్యా యామాల మూలంగా మెదడుపై ప్రభావం పడి మత్తుపదా ర్థాల వైపు నుంచి యువతీ,యువకుల దృష్టి మరలుతుం దని ఫిట్‌నెస్‌ నిపుణులు చెబుతున్నారు. దీంతో వారి లైఫ్‌ స్టైల్‌ మారుతుందని అంటున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top