![]() |
మైదా పిండి.. రెండు కప్పులు
బాదం, జీడి, పిస్తా పప్పులు.. తలా రెండు కప్పుల చొప్పున
పంచదార, బొంబాయి రవ్వ.. చెరో మూడు కప్పులు
యాలకుల పొడి.. ఒక టీ.
నెయ్యి.. నాలుగు టీ.
నూనె.. తగినంత
తయారీ విధానం :
మైదాపిండిలో కాస్తంత నెయ్యి వేసి తగినంత నీరు పోసి పూరీల పిండిలా కలిపి, నానబెట్టాలి. బాదం, పిస్తా, జీడిపప్పులను ఒక నిమిషంపాటు మిక్సీలో వేసి తిప్పాలి. ఆ తరువాత అందులోనే పంచదార వేసి మరీ మెత్తగా కాకుండా.. కాస్త గరుకుగా ఉండేలా పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమానికి యాలకులపొడి, వేయించిన బొంబాయి రవ్వను కలపాలి.
తరువాత నానబెట్టి ఉంచుకున్న మైదా పిండిని మరోసారి మెత్తగా కలిగా చిన్న చిన్న ఉండల్లా చేయాలి. వాటిని చేతితోనే పూరీల్లాగా చేసి మధ్యలో పొడిచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని రెండు టీస్పూన్లంత వేసి చుట్టూ మూసేయాలి. ఇప్పుడు దాన్ని నూనె అద్దుకుంటూ చేత్తోనే కాస్త మందంగా ఉండే పూరీల్లాగా వత్తుకోవాలి. ఆపై బాగా కాగుతున్న నూనెలో ఈ పూరీలను వేసి ఎర్రగా కాల్చి తీయాలి. అంతే రుచికరమైన బాదం, జీడి, పిస్తా పూరీలు తయార్.