అల్జీమర్స్‌(మతిమరుపు)చికిత్స

అల్జీమర్స్‌(మతిమరుపు)చికిత్స
వృద్ధాప్యంలో వచ్చే మార్పులు ఇంటిల్లిపాదినీ కలవరపెడుతుంటాయి. వస్తువులు పెట్టిన చోటు మరచిపోవడం ముదిమి వయసులో సాధారణమే అయినా మతిమరుపు ఎక్కువయి ఇంట్లో వాళ్లని సైతం గుర్త పట్టలేకపోతే... దాన్నే అల్జీమర్స్ అంటారు.
అల్జీమర్స్ అంటే..
మతిమరుపు(డిమెన్షియా) అనేది మెదడుకు సంబంధించిన సమస్య. దీనివల్ల మనిషి అలవాటుపడ్డ పనులలో తేడా రావడం జరుగుతుంది. ఇది మొదట మెదడు భాగాలలో ప్రభావం చూపి మనిషి ఆలోచనా విధానంలో, జ్ఞాపకశక్తిలో, మాట్లాడే విధానంలో మార్పును తీసుకువస్తుంది.


వయస్సు పెరిగే కొద్దీ సమస్య తీవ్రత ఎక్కువవుతుంది. ఒక్కోసారి యుక్తవయస్సు, మధ్యవయస్సు వారిలోనూ అల్జీమర్స్ కనిపిస్తుంది. అలెస్ అల్జీమర్ అనే వైద్యుడు 1906లో మెదులోని కణాలు నశించి , నరాలు దెబ్బతిని జ్ఞాపకశక్తి, ఆలోచన, జీవన విధానంలో రోజూ చేసే పనులలో తేడా వస్తుందని కనుగొన్నాడు. అందుకే ఆయన పేరుపైన ఈ వ్యాధిని అల్జీమర్స్ అని పిలుస్తున్నారు.
కారణాలు
వయసు పైబడిన వారిలోనే అల్జీమర్స్ ఎక్కువగా కనిపిస్తోంది. కటుంబంలో ఎవరైనా అల్జీమర్స్‌తో బాధపడుతున్నట్లయితే వంశపారపర్యంగా పిల్లలకు వచ్చే అవకాశం కూడా ఉంది. కొన్ని రకాల జీన్స్ వల్ల వచ్చే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది.


ముఖ్యంగా మెదడులో కొన్ని ప్రొటీన్లు రక్తంలో కొలెస్టరాల్‌ను పెంచి అల్జీమర్స్ రావడానికి దోహదం చేస్తున్నాయి. ఏదైనా ప్రమాదంలో తలకు దెబ్బ తగిలినపుడు మెదడులో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడినపుడు అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రక్తసరఫరా
గుండె కొట్టుకుంటున్నప్పుడు 20 నుంచి 20 శాతం రక్తం గుండె నుంచి మెదడుకు రక్తనాళాల ద్వారా సరఫరా అవుతుంది. మెదడులోని కణాలకు అవసరమైన ఆక్సిజన్ ఈ రక్తసరఫరా ద్వారానే అందుతుంది. రక్తనాళాలలో ఏవైనా అడ్డంకులు ఏర్పడినపుడు, మెదడుకు జరిగే రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడినపుడు అక్సిజన్ అందడం నిలిచిపోతుంది.


దీనివల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గుండె జబ్బులు, స్ట్రోక్, రక్తపోటు ఎక్కువగా ఉండటం, డయాబెటిస్, కొలెస్టరాల్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాలు దెబ్బతినడం వంటి కారణాల వల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉంది. ధూమపానం, మధ్యపానం వల్ల రక్తనాళాలు దెబ్బతిని అల్జీమర్స్ అవకాశం ఎక్కువగా ఉంది.
లక్షణాలు
అల్జీమర్స్ వ్యాధిలో కనిపించే సాధారణ లక్షణం మతిమరుపు. ఈ వ్యాధి మొదటి దశలో జ్ఞాపకశక్తి కోల్పోవడం, బాగా తెలిసిన వ్యక్తుల పేర్లను సైతం మర్చిపోవడం, కాలకృత్యాలు సరిగ్గా తీర్చుకోలేకపోతుండటం, ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోలేకపోవడం, చిన్న చిన్న లెక్కలు కూడా చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.


రెండవదశలో బ్రష్ ఎలా చేసుకోవాలో మరచిపోవడం, తల ఎలా దువ్వుకోవాలో మరచిపోవడం, ఇంట్లో వారిని గుర్తుపట్టకపోవడం జరుగుతుంది. సరిగ్గా మాట్లాడలేకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం, రాయలేకపోవడం, చదవలేకపోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు.
నిర్ధారణ
రక్తపరీక్షలు, బ్రెయిన్ సి.టి స్కాన్, ఎమ్ఆర్ఐ స్కాన్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు. శారీరక, మానసిక పరీక్షలు నిర్వహించడం ద్వారా అంచనా వేయవచ్చు.


చికిత్స
అల్జీమర్స్ తో బాధపడుతున్న వ్యక్తికి హోమియో చికిత్స అందించడం ద్వారా జీవన విధానంలో మార్పు తీసుకురావచ్చు. ముందుగా రోగి శారీరక, మానసిక లక్షణాలు పరిశీలించి చికిత్స అందించడం జరుగుతుంది.


ముఖ్యంగా అడ్వాన్స్‌డ్ సి.టి చికిత్స బాగా ఉపకరిస్తుంది.ఈ చికిత్స వలన రక్తనాళాలలో రక్తసరఫరా మెరుగుపడుతుంది. మెదడుకు రక్తసరఫరా మెరుగుపడుతుంది. హోమియో మందులు మెదడులోని నరాలు, రక్తనాళాలపై ప్రభావం చూపడం వల్ల రోగి త్వరగా కోలుకుంటాడు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top