![]() |
వెండితెరపై తమ అందచందాలతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి చావ్లా, తనూరాయ్, కరిష్మా కొటక్లాంటి పలువురు తారలు తమ డాన్సులతో బుల్లితెర వీక్షకులను అలరిస్తున్న కార్యక్రమం ‘నాచోరే’. మొత్తం 12 మంది కథానాయికలు పాల్గొంటున్న ఈ షోకి ‘12 మంది రాణులు - ఒకటే కిరీటం’ అని ట్యాగ్‌లైన్ పెట్టారు. ఈ డాన్స్ బేస్డ్ ప్రోగ్రామ్‌కు ప్రముఖ తార రోజా, నృత్యదర్శకుడు నోబుల్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం గురించి ‘జీ’ తెలుగు బిజినెస్ హెడ్ జి.అనూరాధ చెబుతూ - ‘‘డాన్స్ బేస్డ్ రియాల్టీ షోలను ‘జీ తెలుగు’ పేక్షకులకు పరిచయం చేసింది. ప్రస్తుతం ప్రసారమవుతున్న ‘నాచోరే’ రియాల్టీ షోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. ప్రతి సోమ, మంగళవారాల్లో రాత్రి 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారమవుతోంది. |