Kambaala Konda - కంబాల కొండ

కంబాల కొండ
అరకులోయ, బొర్రా గుహలు, కైలాసగిరి, రామకృష్ణా బీచ్‌, రుషికొండ బీచ్‌, భీమిలి... ఈ పేర్లన్నీ వింటే మీకేమనిపిస్తోంది. అందాల సాగరతీరం విశాఖ మీ కళ్లముందు కదలాడుతోంది కదూ..! అలాంటి ప్రకృతి అందాలకు కొదువలేని ఈ ఉక్కు నగరం సమీపంలో మరో మణిహారం కూడా ఉంది. అదే కంబాల కొండ.ప్రకృతి రమణీయతను తనలో ఇముడ్చుకొని అటవీ జంతువులకు ఆలవాలంగా... సందర్శకుల మది దోచుకుంటోంది కంబాల కొండ...

ఎటు చూసినా పచ్చని తివాచీ పరిచినట్లుండే పచ్చని అటవీ సంపద, గలగలపారే సెలయేళ్ళు, జలాశయం, చెంగుచెంగున ఎగిరే మయూరాలు. అడవికే వన్నె తెచ్చే జింకలు, ఇలా ఎన్నో అందాలకు నెలవైన కంబాల కొండ ఎకో టూరిజం పార్కు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గిరిజనులు నిర్వహించే ఈ పార్కు విశాఖ రైల్వే స్టేషన్‌కు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ఇక్కడికి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. అంతేకాక, ఆర్టీసీ కాంప్లెక్స్‌కు కంబాల కొండకు 3 కిలో మీటర్ల దూరంలో ఉండడం గమనార్హం.కొండకు చేరుకోవాలంటే... రైల్వేస్టేషన్‌, బస్టాండు నుంచి ఆటోలూ, బస్సులూ ఎప్పు డూ అందుబాటులో ఉంటాయి.
ఎన్నెన్నో అందాలు...

కంబాల కొండ అటవీ ప్రాంతం సుమారు ఎనిమిదివేల హెక్టార్ల విస్తీర్ణం పరుచుకొని ఉంది. ఇందులో ఎనభై ఎకరాలను పార్కు కోసం కేటాయించారు. ఇక్కడ నెమళ్లు, కుందేళ్లు, చిరుతపులులు, పాలపిట్టలు, రామ చిలుకలు... ఇలా ఎన్నో రకాలై న పక్షులు, జంతువులను చూడవచ్చు. అంతేకాకుండా... ఇక్కడ నెలకొల్పిన రివర్‌ క్రాసింగ్‌, ట్రెక్కింగ్‌, బోటింగ్‌ వంటి సదు పాయాలు పర్యాటకలను విశేషంగా ఆకర్షిస్తాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా సందర్శకుల సందడితో కిటకిటలాడే కంబాల కొండ అటవీ ప్రాంతంలోకి చీకటి పడిందంటే మాత్రం ఎవరినీ అనుమతించరు. కంబాల కొండ సాంతం ఒకే రోజులో చుట్టేయాలంటే సాధ్యపడే విషయం కాదు. ఎందుకంటే... ఇక్కడ నెలకొన్న ప్రకృతి రమణీయతను తనివితారా చూడాలంటే కనీసం రెండు రోజులైనా ఇక్కడ ఉండాల్సిందే. పర్యాటక శాఖవారు ఇక్కడ కాటేజీ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు కాబట్టి రెండు మూడు రోజులు ఇక్కడ విడిది చేయడం పెద్ద సమస్య కానే కాదు.

ఎన్ని జంతువులు ఉన్నప్పటికీ ఇక్కడి నెమళ్ల కోలాహలం ఎక్కువగా ఉంటుంది. పురివిప్పి ఆడే మయూరాల వయ్యారాలను చూసేందుకు సందర్శకులు క్యూ కడతారు. ఇక చలాకీ కుందేళ్ల వెంట పరుగులు తీసేవాళ్లు కొంతమందైతే... లేళ్లతో పోటీపడేవాళ్లు మరికొందరు. ఇలా ఎవరికి తోచినవిధంగా వాళ్లు పసిపిల్లలైపోతారంటే అతిశయోక్తి కాదు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top