పెరుగు గడ్డలా, మీగడలా తోడుకోవట్లేదా? ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీరు కూడా నిపుణులే!

Kitchen tips
Kitchen Tips:ఇంట్లో పాలు సరిగ్గా తోడుకోకపోతే లేదా పెరుగు పుల్లగా అయిపోతే మనలో చాలామంది అసంతృప్తిగా ఫీల్ అవుతాం. హోటళ్లలో లేదా దాబాల్లో లాగా చిక్కటి మీగడ పెరుగు మన ఇంట్లో ఎందుకు రాద అని ఆలోచిస్తుంటారా? 

అయితే ఇకపై ఆ చింతే వద్దు! కొన్ని చిన్న చిన్న కిచెన్ చిట్కాలు పాటిస్తే చాలు.. చలి కాలంలో నైనా సరే పెరుగు అచ్చం గడ్డలా, తియ్యగా, ఎంతో రుచిగా తోడుకుంటుంది. పర్ఫెక్ట్ పెరుగు కోసం ఎలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వాలో ఈ బ్లాగ్‌లో స్టెప్-బై-స్టెప్ తెలుసుకుందాం.

పెరుగు త్వరగా, రుచిగా తయారవ్వాలంటే ఈ సులభమైన పద్ధతులు పాటించండి.. చాలా ఇళ్లలో పెరుగు త్వరగా తయారవ్వకపోవచ్చు లేదా తయారైనా పుల్లగా లేదా రుచి లేకుండా ఉండవచ్చు. అలాంటి సమస్యలు ఎదుర్కొనే వారు పెరుగు తయారీ పద్ధతిని కొద్దిగా మార్చుకుంటే చక్కటి ఫలితం పొందవచ్చు.

వెచ్చని నీటి ప్లేట్ విధానం: పెరుగు త్వరగా తయారవ్వాలంటే, ఒక ప్లేట్‌లో కొద్దిగా గోరువెచ్చని నీటిని పోసి, ఆ నీటిలో తోడు వేసిన పాల గిన్నెను ఉంచండి. ఇలా చేస్తే తక్కువ సమయంలోనే రుచికరమైన పెరుగు సిద్ధమవుతుంది.

గిన్నెలో గిన్నె టెక్నిక్: తోడు వేసిన పాల గిన్నెను మరొక పెద్ద గిన్నెలో ఉంచి, మూత పెట్టండి. ఇది వేడిని నిలుపుకుని పెరుగు త్వరగా తయారవ్వడానికి సహాయపడుతుంది.

పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి ఉపాయం: గిన్నె అడుగున కొద్దిగా పెరుగు (తోడు) వేసి, ఆపై పాలు పోయండి. ఆ మిశ్రమంలో ఒక పచ్చిమిర్చిని ముంచండి లేదా ఎండుమిర్చిని తుంచి వేయండి. ఇలా చేయడం వల్ల రెండు మూడు గంటల్లోనే చిక్కటి, రుచికరమైన పెరుగు తయారవుతుంది. ఎండుమిర్చి వాడితే పెరుగు పులుపు రాకుండా ఉంటుంది.
కవ్వంతో చిలకడం: తోడు వేసిన తర్వాత పాలను కవ్వంతో కొద్దిసేపు చిలకడం వల్ల కూడా పెరుగు త్వరగా తయారవుతుంది.

ఈ సాధారణ చిట్కాలతో మీరు తక్కువ సమయంలో రుచిగా, చిక్కగా ఉండే పెరుగును సులభంగా తయారు చేసుకోవచ్చు!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top