Rakta Charitra Trailor


‘రక్తచరిత్ర’కు ముందు రాయలసీమ ఫ్యాక్షనిజం గురించి నాకేం తెలియదు. కాస్తో కూస్తో.. బెజవాడ రౌడీజం గురించి తెలుసు. ఎందుకంటే అక్కడ చదువుకున్నాను కాబట్టి. నాయుడుగారి స్టూడియో సమీపంలో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు తొలిసారి పరిటాల రవి పేరు విన్నా. శివారెడ్డి అనే నాయకుడు ఘోరంగా హత్యకు గురైనప్పుడు ఫ్యాక్షనిజంపై ఆసక్తి మొదలైంది. ఓ రోజు తెలిసిన ఓ లీడర్‌తో మాట్లాడుతుండగా.. ఆయన పరిటాల రవి గురించి కొన్ని విషయాలను చెప్పారు.


‘రక్త చరిత్ర’ అనే ఆలోచనకు మొగ్గ తొడిగిన క్షణం అదే. కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన అంశాలన్నీ అందులో కనిపించాయి. వెంటనే అనంతపురం వెళ్లాను. ఆయనకు సంబంధించిన వ్యక్తులను కలిశాను. మద్దెలచెరువు సూరిని కలిశాను. ఆయన వెర్షన్ కూడా విన్నాను. ఎవరి వెర్షన్‌లో వాళ్లు చెప్పింది వారి పరంగా చూసుకుంటే కరెక్టే అనిపించింది. అంతేకాదు.. వారి కథ మరో మహాభారతంలా అనిపించింది. వారి నుంచి తీసుకున్న అభిప్రాయాల ద్వారా నాకు అనిపించిన నిజాన్ని సినిమాగా తీశా.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top