![]() |
టొమాటోలు- 6
నీళ్ళు - 4 కప్పులు
క్యారట్ తరుగు - పావుకప్పు
ఉల్లితరుగు- పావు కప్పు
ఉప్పు - తగినంత
మిరియాలు- 6
పంచదార - టీ స్పూను
కొత్తిమీర తరుగు - టీ స్పూను
వెన్న లేదా నెయ్యి - టీ స్పూను
ఏలకులు - 2
వెల్లుల్లి - 2 రేకులు
బిర్యానీ ఆకులు - 2
తయారి:
టొమాటో, క్యారట్, నీళ్ళు, ఏలకులు, మిరియాలు, వెల్లుల్లి, ఉల్లిపాయ, పంచదార, బిర్యానీ ఆకులు కుకర్‌లో పెట్టి ఉడికించాలి. నాలుగు విజిల్స్ రాగానే తీసేయాలి. మెత్తగా అయిన టొమాటో మిశ్రమాన్ని చేత్తో మెదిపి ఆ గుజ్జును వడకట్టాలి. తరువాత మూకుడులో వెన్న లేదా నెయ్యివేసి బ్రెడ్ ముక్కలను వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే మూకుడులో వడకట్టి ఉంచుకున్న టొమాటో మిశ్రమాన్ని వేసి సరిపడా ఉప్పు కలిపి అయిదారు నిమిషాలు స్టవ్ మీద పెట్టి దించేయాలి. తరువాత కొత్తిమీర గార్నిష్ చెయ్యాలి. టొమాటో సూప్‌ని తీసుకునే ముందు బ్రెడ్ ముక్కలను వేస్తే క్రిస్పీగా ఉంటుంది.