![]() |
వాంతి అవుతున్నట్లు తెములుతూ రక్త వాంతి అయితే ఫుడ్ పైప్, జఠరాశయాల దగ్గర మ్యూకస్ పొర దెబ్బతిన్నట్లు! దీనిని ‘మల్లోరివీన్టౌర్’ అంటారు లివర్ జబున్న వాళ్ళలో రక్తపు వాంతి అయితే గొంతు రక్త నాళాలు చిట్లి అవుతున్నట్లు... యాస్పరిన్, పెయిన్ కిల్లర్స్ వేసుకున్న వాళ్ళకు గాస్ట్రిక్ సిర్రోసిస్ లేక అల్సర్స్ వల్ల నల్లటి, కీఫీ రంగులో రక్తపు వాంతి అవుతుంది. ఛాతీ ప్రాంతంలో నొప్పి ఉంటూ బరువు తగ్గుతూ రక్తవాంతులవుతుంటే ఆహారనాళం పై భాగంలో కాన్సర్ ఉన్న ట్లు అనుమానించాలి. ఇలా రోగి చరిత్ర, చెప్పే విశేషాల్ని బట్టి రక్తం వాంతులలో రక్త స్రావం ఎక్కడ నుంచి అవుతుండవచ్చో అంచనా వేయవచ్చు. భౌతిక పరీక్ష లు మరికొన్ని వివరాల్ని అందిస్తాయి. నిర్థారణకి జాండిస్, కడుపుబ్బరం, కాళ్ళ వాపులాంటివి ఉంటే లోపల లివర్ అనారోగ్యం ఉండి, ఆహరనాళం పై భాగంలో మెత్తగా ఉంటే పెప్టిక్ అల్సర్స్ ఉన్నట్లు అనుమానం రావాలి. వంశపారంపర్యంలో వచ్చే హెరిడిటరి హెమరేజిక్ తెలంగి ఎక్టౌసియేలో కడుపులోంచి వచ్చే రక్త నాళాలలోంచి కూడా రక్తం వస్తుంది.
రక్తం వాంతులవుతుంటే ఎండోస్కోపి చేయించడం మంచిది. రోగి పరిస్థితి కొద్దిగా కుదుటపడిన తర్వాత ఫాస్టింగ్లో ఎండోస్కోపి చేయించాలి. కడుపు శుభ్రం చేసిన తర్వాత ఎండ్రోస్కోప్ చేయించాలి. లేకపోతే రక్తం, రక్తపు గడ్డలు ఆహార నాళంలోపలి భాగాన్ని సరిగా చూడనివ్వవు. రక్త ప్రసరణకు సరైన కారణాన్ని ముందు కనుక్కోవాలి. కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ఎక్కడ నుంచి, ఎందుకు ఎలా రక్త స్రావమవుతోందో తెలుసుకుంటే చికిత్స సరిగా చేయడానికి వీలవుతుంది.
దగ్గుతున్నపుడు, వాంతి చేస్తున్నపుడు రక్తం ఊపిరితిత్తులు, శ్వాసనాళాలలోకి వెళ్ళకుండా జాగ్రత్తపడాలి. ఇంట్రావీనస్ ద్రావకాల్ని, రక్తాన్ని ఇస్తూ రక్తపోటు పడిపోకుండా జాగ్రత్తపడాలి. కడుపుని ఖాళీగా ఉంచాలి. ముక్కు ద్వారా ట్యూబ్ని లోపలికి పంపి, కడుపులో వున్న వాటన్నింటినీ తీసివేయాలి. ఫ్రెష్ ప్లాస్మాలాంటివి లోపలికి పంపి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజిన్ చేస్తూ రక్తం గడ్డ కట్టడాన్ని పెం పొందించాలి. ఇలా చేసి రోగి పరిస్థితి కాస్త నెమ్మదించగానే ఎండోస్కోపి చేయాలి. ఎందుకు రక్తస్రావం ఎక్కడ నుంచి జరుగుతోందో తెలుసుకుంటే రక్తస్రావాన్ని అరికట్టవచ్చు. రక్తనాళాలకు బాండ్ వేసి రక్త స్రావమయ్యే ప్రాంతంలోకి ఇంజెక్షన్స్ చేసి, ఆరాన్గాస్తో గాని లేజర్ కిరణాలతోగాని రక్తం స్రావమయ్యే ప్రాంతాన్ని కాల్చి రక్తస్రావం ఆగేట్టు ముందు చూడాలి.
రక్తస్రావాలలో 90శాతం ఎండోస్కోపి రకరకాల పద్ధతుల ద్వారా వెంటనే అరికట్టవచ్చు. ఎండోస్కోపితో రక్తస్రావాన్ని అరికట్టలేకపోతే వెంటనే శస్తచ్రికిత్స అవసరం.