తనివితీరని ప్రకృతి సోయగం తలకోన


కొండ అంచుల్లో దట్టమైన అరణ్యమార్గం... రెండు కొండల మధ్య నుంచి జాలువారే జలపా త సౌందర్యం... ఎటుచూసినా పచ్చని తివాచీ లాంటి ప్రకృతి సోయగం... పర్యాటకులకు సిద్ధేశ్వరుని కటాక్షం... ఎంతచూసినా తనివితీరని అందాలన్నీ తనలో ఇముడ్చుకున్న అద్భుత పర్యాటక కేంద్రం తలకోన.
         

తలకోన... చిత్తూరు జిల్లా యెర్రావారిపాలెం మండలంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. తిరుపతి కి 45 కిమీ దూరంలో నల్ల మల పర్వతశ్రేణుల మధ్యలో ఉన్నది ఈ ప్రకృతి అందం. ఇక్కడ 60 మీటర్ల ఎత్తు నుండి పడుతున్న జలపాతాలు చూపరులను కట్టిపడేస్తా యి. దట్టమైన అడవి, ఎత్తైన కొండలకు మధ్యభాగంలో జలపాతం ఉం డడం వల్ల ఇక్కడకు చేరుకునే పర్యాటకులు మరుపురాని అనుభూతిని సొంతం చేసుకుంటారు. ఓషధీ లక్షణాలు కల మొక్కలకు ఇక్కడ కొదు వలేదు. తలకోనకు చేరగానే మొదట ఎదురయ్యేవి సిద్దేశ్వరాలయం, అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రమణ్యస్వామి ఆలయాలు. అలయానిి సమీపంలో సంవత్సరం పొడవునా ప్రవహించే వాగు ఉంటుంది. ఆల యం నుండి ముందుకు సాగే కొద్దీ నెలకోన, దిగువ ఝరి, ఎగువ ఝరి లు మనసును మైమరిపిస్తాయి. ఈ మూడింటికి చాల ప్రాముఖ్యత ఉంది. నెలకోన దట్టమైన కొండల మద్య ఉంది. ఇక్కడి రెండు కొండల మధ్య నుండి నీటి ప్రవాహం వచ్చి ఒక కొలనులో దూకుతూ ఉంటుంది. చాలా లోతైన ఈ కొలను లోతు ఇప్పటి వరకూ ఎవరూ కనుగొన్న సాహసం చేయలేదు. ఇక్కడ చెప్పుకోదగ్గ ఆకర్షణీయమైన ప్రదేశం... రెండు కొండల నడుమ ఉండే పెద్ద గుండు రాయి. మీద పడుతున్నట్లు ఉండే ఈ రాయి పర్యాటకులకు వింత అనుభూతిని కలిగిస్తుంది.

తలకోనలో వసతి సౌకర్యాలు...
పర్యాటకులు బసచేసేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ పర్యా టక అభివృద్ధి సంస్థ ఇక్కడ పున్నమి అతిథి గృహాన్ని నిర్మించింది. ఆలయానికి ముందు భాగంలో పూజా సాముగ్రి విక్రయించే చిన్న దుకాణాలు ఎప్పుడూ సం దడిగా ఉంటాయి. అలాగే ఆలయానికి పక్కనే ఓ చిన్న హోటల్‌ ఉంది. తలకోనకు వెళ్లే చాలామంది పర్యాటకులు తినుబండారాలను తమతో తెచ్చుకుం టారు. తలకోనలోని జలపాతాన్ని సందర్శించే పర్యా టకులు సాయంత్రం వరకు జలపాతం వద్ద గడిపి పొద్దుపోయే సమయానికి గుడివద్దకు చేరుకుంటారు. అలాగే పర్యాటకుల్లో ఏ కొద్దిమందో తప్ప మిగిలిన వారు సాయంత్రానికి సమీపంలోని గ్రామానికి లేదా సొంత ప్రదేశానికి పయనమవుతారు.
రవాణా సౌకర్యాలు...


తిరుపతి పట్టణం నుంచి తలకోన 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుంచి యెర్రావారిపాళెం చేరుకుని అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా తలకోన ఆలయం వద్దకు చేరుకోవచ్చు. యెర్రావారి పాళెం వరకు ఎళ్లప్పుడూ బస్సు సౌకర్యం ఉండగా అక్కడి నుంచి తలకోనకు చేరడానికి వ్యాన్‌, ఆటోల సౌకర్యం ఉంది. సినిమా షూటింగ్‌లకు తలకోన పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో దాదాపు ఏడాదిలో చాలారోజులు షూటింగ్‌లు జరుగుతూ ఉంటాయి. చుట్టూ ఎత్తైన కొండలతో, దట్టమైన అరణ్యప్రాంతం మధ్యలో వెలసిన ఈ జలపాతం నిత్యం పర్యాటకుల రద్దీతో కళకళలాడు తుంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top