![]() |
కావలసిన వస్తువులు:
వరిపిండి - పావు కేజి
నవ్వులు - ఒక స్పూన్
పెసరపప్పు - ఒక స్పూన్
కారం - ఒక స్పూన్
జీలకర్ర, ఉప్పు - తగినంత
తయారు చేయు విధానం:
ముందుగా పిండి జల్లించుకొని పళ్లెంలోకి తీసుకోవాలి. స్టౌవ్‌పై గినె్న పెట్టి 1 గ్లాసు నీళ్లు పోసి మరిగాక ఆ పిండి వేసి అడుగంటకుండా గరిటెతో కలపాలి. దానిలో కారం, ఉప్పు, పెసరపప్పు, నువ్వులు, జీలకర్ర వేసి బాగా కలపాలి. చల్లారాక దించాలి. ఇప్పుడు స్టౌవ్ మూకుడు పెట్టి నూనె పోయాలి. అది మరిగేంతలో ఉడికించి ఉంచుకున్న ముద్దను చిన్న, చిన్న ఉండలుగా తీసి చేతితో గాని, బల్లపై గాని ఒక్కొక్కటి చేగోడీల్లా చుట్టాలి. వీటిని నూనెలో వేసి వేయించి, తీసి తింటే భలే రుచిగా వుంటాయి. చేయడం కొంచెం శ్రమే అయినా చాలా టేస్టీగా ఉంటాయి.
మరో విశేషం ఏమిటంటే ఈ ముద్దను మామూలుగా కూడా తినవచ్చు. వీటిని ఒక ప్లాస్టిక్ పేపరుపై ఒడియాలుగా పెట్టుకుని ఎండాక నూనెలో వేయించుకొని తింటే బాగుంటాయి. సాంబారులోకి, ఈవెనింగ్ స్నాక్స్‌గా తినడానికి బాగుంటాయి. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ఈ పిండిని ఉడికించడానికి మరో గ్లాసు నీళ్ళు ఎక్కువ పోయాలి. అప్పుడే పలచగా చిప్స్‌లా వస్తాయి. కారానికి బదులు పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే తెల్లగా వుంటాయి.