ప్రేమను తెలిపేందుకు బొకేలతో... బోలేడు సందేశాలు

ప్రేమను తెలిపేందుకు ఎన్నో మార్గాలున్నా పుష్పాలతో తెలిపే ప్రేమ ప్రత్యేకతే వేరు. మనకు తెలిసిన పలు రకాల పూలు ఎన్నో ప్రేమ భాషలను తెలియజేస్తాయి. ఒక్కోరకం పువ్వు ఒక్కోతరహా భావాలను మన ముందుంచుతుంది. తొలిసారిగా ప్రేమను తెలియజేయడానిి ఒకటి, విరహవేదనతో తపించిపోతున్నాని తెలిపేందుకు మరొకటి, ప్రగాఢ విశ్వాసాన్ని గుర్తుచేసేందుకు ఇంకొకటి ఇలా రకరకాల భావాలను ఈ పుష్పాలు తెలియజేస్తాయి. ఏదెైనా భావాన్ని తెలియజేయాలంలే ఆ పువ్వులతో తయారుచేసిన బొకేను అందజేస్తేచాలు. ఏంటీ నమ్మకం కుదరటం లేదా... ఈ మోడ్రన్‌ రోజులలో కూడా ఇవేంటి అని ఆశ్చర్యపోతున్నారా... అయితే ఏ బొకే ఎలాంటి సందేశం ఇస్తుందో తెలుసుకోండి మరి... 

                ప్రేమ అనేక రూపాలలో దర్శనమిస్తోంది. తమలోని ప్రేమను తెలిపేందుకు కొంతమంది పెైశాచికంగా కూడా ప్రవర్తిస్తున్నారు. ఇది ఎవరూ హర్షించని పద్ధతి. ప్రేమికులను ప్రసన్నం చేసుకునేందుకు ఇలాంటివి ఎలాంటి ప్రయోజనం ఇవ్వదని చరిత్రే చెబుతోంది. ప్రేమ సందేశం పంపించడానికి పువ్వులను మించి మరోటి లేదనేది వాస్తవం. మన తోటలోని పుష్పాలతోనే మనం చెప్పదలచుకున్న భావాలను చెప్పకనే చెప్పవచ్చు.ప్రేయసి లేదా ప్రియుడి మీద మీకు ఎలాంటి భావాలున్నాయో తెలుపవచ్చు. ముఖ్యంగా బహుమతులు అందజేసేటప్పుడు, ముఖ్యమైన రోజులనాడు బహుమతులతో పాటు పుష్పాలను జతగా చేర్చి ఇవ్వడం అనాదిగా వస్తున్న పద్దతి. పుష్పాలతో సందేశం ఇవ్వడం కొత్తగా అనిపించినా పూర్తిగా తెలుసుకుంటే ఎంతో థ్రిల్‌గా కూడా ఉంటుంది.


సన్‌ఫ్లవర్‌:
‘సన్‌ఫ్లవర్‌ ఈజ్‌ ది సింబల్‌ ఆఫ్‌ సన్నీ ఫెర్వర్‌ ఆఫ్‌ లవ్‌’ అంటే సూర్యకాంత పుష్పం ప్రసన్నమైన ప్రగాఢప్రేమకి సంకేతం. పొద్దు ఎటువెైపు తిరుగుతుందో అంటే సూర్యుడు ఎటుకేసి తిరుగుతాడో ఆ పుష్పం అటే తిరుగుతుంది. ‘‘పొద్దస్తమానం నా మనసు నీచుట్టే తిరుగుతుంది’’ అని చెప్పకుండానే చెప్పడానికి సన్‌ఫ్లవర్‌ ప్రజెంట్‌ చేస్తే చాలు. పెైగా పసుపురంగు విధేయతకి, విశ్వాసపాత్రతకీ చిహ్నం కూడా మరి!
కార్నేషన్స్‌: 

చాలా కాలం వాడిపోకుండా, అందాలు చిందిస్తూ, సువాసనలు వెదజల్లే ‘కార్నేషన్‌ ఫ్లవర్స్‌’ మీ ప్రేమ చిరకాలం వెల్లివిరియాలని కోరుకోవడానికి ‘పూల బాసల’న్న మాట! మీ అంతరంగాల ప్రేమ తరంగాలలా, మీ అనిర్వచనీయమైన ఆరాధనలా, అజరామరమైన ప్రేమలా, ‘ప్రేమపుష్పాలు’ (ఫ్లవర్స్‌ ఆఫ్‌ లవ్‌)గా పేరుపడిన ‘కార్నేషన్స్‌ ఫ్లవర్స్‌’లో ముంచెత్తడం కంటే మించిన ప్రేమ పట్టాభిషేకం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.

తులిప్‌:
రంగూ, రుచీ, వాసనలు ప్రేమ రసాయనిక శాస్త్రాన్ని (కెమిస్ట్రీ ఆఫ్‌ లవ్‌) వివరిస్తాయేమో కాని ప్రేమైక జీవన సారాన్ని అందించలేవు. మీ హృదయంతర స్పందనకి అనుగుణంగా ప్రతి స్పందించేవి కావు.‘క్రిమ్‌షన్‌ డ్రీమ్స్‌’ అయినా పర్పుల్‌ డిలెైట్స్‌ అయినా, పింక్‌ ట్రాన్స్‌ అయినా, మీ తొలి ప్రేమ (ఫస్ట్‌ లవ్‌) సోయగాలని విప్పి చెప్పడానికి ‘తులిప్‌ ఫ్లవర్‌ బొకేస్‌’ని మించినవేవీ లేనే లేవు.



ఐరిస్‌:
మనసంతా ఆమే! మీ గుండెలనిండా అతనే! కానీ తెలియజేయడం ఎలా ? ప్రేమికుల, ప్రగాఢ విశ్వాసాన్ని, సంకేతాలు ఐరిష్‌ పుష్పాలు. విరహ వేదనలనీ, ఎడబాటు పాట్లను రోజురోజుకీ మీలో రాజుకుంటున్న ప్రేమ సెగలను, అనురాగాలను, ఎంతో లాలనగా వివరిస్తే, మాటలకందని ‘మధుర భావాల సుమ మాలలతో’ అలరించే సమయంలో అందించండి ఐరిష్‌ ఫ్లవర్‌ బొకేస్‌!

లిల్లీ:

గ్రీకు పురాణ గాధలలో వాయిస్‌ ఆఫ్‌ మ్యూజెస్‌గా అభివర్ణించిన లిల్లీ పుష్పం, దెైవికమైన ప్రేమకీ, దెైహికమైన సౌకుమార్యానికీ సంకేతం. మెత్తటి రంగులతో, మత్తెక్కించే గుబాళింపులతో, మీ ‘నవనీత హృదయ, అంతరంగిక శాంతి దేవతనీ, ఆశాపధాంతరాళ పారిజాతాన్నీ, ప్రేమ జీవన విభాత కైశిక గీతినీ, కల్పవల్లినీ, పూజించే పుష్పాలు లిల్లీ ఫ్లవర్స్‌. లిల్లీ ఫ్లవర్‌ బొకే మీ స్వచ్ఛమైన హృదయానికి సంకేతమన్నమాట!



వెైల్డ్‌ ఫ్లవర్‌:

మూగబాసలతో, మురిపించే సైగలతో, మీ ప్రేమాస్పదులని మైమరపించదలుచుకున్నారా? ఏవో ఏవో భావాలూ, ఎదలో పందిరి వేసెనులే.. అనే పాటల చరణాలు వల్లించాల్సిన అవసరం లేదు.‘ఐలవ్‌యూ’ అని తడారిపోయిన పెదాలతో పలికేకన్నా ‘ఒక వెైల్డ్‌ ఫ్లవర్‌ బొకే’ అందించేస్తే మీప్రేమ మరింతగా అందంగా కనబడుతుంది.


ఆర్చిడ్‌:  
మీ అనంత, అపార ప్రేమని, అర్థవంతంగా వివరించగలిగే సంకేతాలే ఆర్చిడ్‌ ఫ్లవర్స్‌. గోముగా, గారంగా, మీ తీపి మాటల గుసగుసలకి గురుతులుగా, విరబూసిన అందాల అందలాలకెక్కిస్తాయి ఆర్చిడ్‌ ఫ్లవర్స్‌. అవిరళమైన ఆత్మ ప్రేమకీ, అపారమైన అనురాగాలనుభూతికి ప్రేమికులకీ, ఆర్చిడ్‌ ఫ్లవర్‌ బొకేస్‌ అందించి యువతకి ఆదర్శప్రాయంగా మూర్తీభవించండి మరి!

ప్రిమ్‌ రోజ్‌:
ప్రిమ్‌ రోజెస్‌ ఇంద్రజాలాలతో (మ్యాజికల్‌ స్లె్పండర్‌) లోతెైన మీ ప్రేమతత్వాన్ని, ప్రగాఢమైన ఆరాధననీ వివరించడానికి కూడా అదృష్టవంతులే నోచుకుంటారు. అసలు ఏ భాషలో, ఎన్ని మాటలలో, ఎలాంటి పాటలలో మీ ప్రేమను వివరిస్తే మీ తనివి తీరుతుంది? నువ్వు లేకుండా నేను ఉండడం అసాధ్యం అని మీ ప్రేమికుల కళ్లలో కళ్లు పెట్టి చూసి చెప్పాలనిపిస్తోందా? కానీ, అలా అనడానికి సిగ్గూ, సంకోచం, బిడియం అడ్డొస్తున్నాయా ! అయితే, ప్రిమ్‌ రోజెస్‌ బొకే ఇవ్వండి చాలు. మీ ప్రేమికులకి ఏ పాటి ‘ఇంగితం’ ఉన్నా మనోగతమైన మీ ప్రేమను తెలుసుకోగలుగుతారు.

లిలాక్‌: 

నువ్వింకా నన్ను ప్రేమిస్తున్నావా? అని అడగాలంటే, సున్నితంగా, సుతారంగా వుండే లేలేత యువతీ యువకులకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మీరడగదలుచుకున్న మాట, మీ గుండెలని దొలిచేస్తున్న ప్రశ్న. ‘లిలాక్‌ ఫ్లవర్‌ బొకే’ అవలీలగా అగిడేస్తుంది. పెైగా ఊదారంగు (వయోలెట్‌ కలర్‌) ప్రేమకి సంకేతమే కదా! లిలాక్‌ ఫ్లవర్స్‌, మనోహరమైన ఊదారంగుతో, మనోజ్ఞమైన వెచ్చదనంతో, హుందాతనంతో, అందచందాలతో, ప్రేమని నిర్వచిస్తాయి. కనుక, ఏమీ సంకోచించకుండా, ‘లిలాక్స్‌ నెవర్‌ లాక్స్‌ లవ్‌’ అంటే ‘లిలాక్స్‌లో ప్రేమ ఎప్పటికీ తరగిపోదు’ అనే ఆత్మ విశ్వాసంతో, లిలాక్స్‌ బొకే బహుకరించండి.


రోజ్‌:


‘లెైఫ్‌ ఈజ్‌ నాట్‌ స్ట్‌ ఎ బెడ్‌ ఆఫ్‌ రోజెస్‌ బట్‌ థార్స్‌‌న టూ’ అంటే జీవితం కేవలం రోజాపూల పాన్పుకాదు, చురుక్కుమనిపించే ముళ్లూ ఉంగాయి. అనే వాస్తవ జీవన సత్యాన్ని వివరించే ‘రోజాలు’ రారాజులకీ, మహరాజులకే కాక, మామూలు మనుషులకి కూడా, మనోహరాలే ! శృంగార తరంగాలకి సంకేతాలెైన గులాబీ పూరేకులతో సోకితే చాలు! ఎలాంటి శిలా హృదయమైనా, కరిగి పోతాయి.రంగురంగుల గులాబీలలో ప్రతిరంగుకీ ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. పదిలమైన భావం ఉంది.అవేమిటో తెలుసుకొని ప్రేమపూర్వకంగా, స్నేహ పాత్రంగా, గులాబీ పూగుత్తులూ, రోజ్‌ ఫ్లవర్‌ బొకేస్‌ కూడా ప్రెజెంట్‌ చేయవచ్చు మరి!   
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top