చర్మవ్యాధి నివారణా తైలాలు-2

ఉపశమనానికే పరిమితం కాకుండా చర్మ వ్యాధులను పూర్తిగా నివారించేందుకు ఉపయోగపడేవి Äౌగిక తైలాలు. కొన్ని రకాల వనమూలికల బెరడు, ఆకులు, గింజలు, పండ్లతొక్కలు, పూరేకులు దంచి ముద్దగా చేసి దానికి తగిన నిష్పత్తిలో నువ్వుల నూనె లేదా ఆముదపు నూనె లేదా కొబ్బరి నూనె తీసుకుని మంచి నీళ్లుగానీ లేదా అదే మూలికా కశాయాన్నిగానీ కలిపి ఆయుర్వేద వైద్యులు ఈ తైలాలను తయారు చేస్తారు. చర్మవ్యాధి చికిత్సలో ఈ Äౌగిక తైలాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.

మహా మరిచాది తైలం
మిరియాలు, తెగడ, దంతీ, జిల్లేడు పాలు, పేడరసం, దేవదారు, పసుపు, మాను పసుపు, జటామాంసీ, కోష్టు, గంధం, వెర్రిపుచ్చ, గన్నేరు, హరితాలకం, మనశ్శిలా, చిత్రకం, లాంగలి, వాయు విడంగాలు, కొడిసెపాల, వేపచెక్క, సప్తపర్ణి, ఆకు జెముడు పాలు, తిప్పతీగ, ఆరగ్వధ, కానుగ, తుంగముస్తలు, చండ్ర చెక్క, పిప్పళ్లు, వస, మాల్కంగినీ, వత్సనాభి, మొదలగు మూలికల కల్కానికి తగిన నిష్పత్తిలో నువ్వుల నూనె, గోమూత్రం చేర్చి 'తైలపాక విధి'లో ఆయుర్వేద నిపుణులు తయారుచేస్తారు.

ఉపయోగాలు:
           వ్రణశోధ (సెల్యులైటిస్), కాలిన పుండ్లు, దెబ్బ తగిలిన గాయాలు, రసిగారే పుండ్లు, కురుపులు, లసీకా గ్రంధిత శోధ (లింఫాడినైటిస్) మొదలగు వివిధ చర్మ వ్యాధుల పైన ఈ తైలంతో డ్రెస్సింగ్ చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

             పొడిబారినవి లేదా దురదతో ఉన్న పుండ్లు లేదా దద్దులు (అర్టికేరియా) దుష్టవ్రణాలు (రాచపుండ్లు) ఈ తైలంతో ఉపశమిస్తాయి.
చి స్త్రీలలో రుతుశూల ఉన్నప్పుడు ఈ నూనె ఓ 10 చుక్కలు తీసుకుని కాస్త వేడి చేసి, బొడ్డులో వేసి, ఆ పైన పొట్టపైన సున్నితంగా మర్ధన చే స్తే కడుపు నొప్పి తగ్గే అవకాశం ఉంది.
సూచన: 

ఈ నూనె కళ్లకు అంటితే ప్రమాదం. అందుకే తైలాన్ని మర్ధన చేసిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

జాత్యాది తైలం:
సంపెంగ ఆకులు, వేపాకులు, పొట్లాకులు, కానుగాకులు, కానుగ విత్తులు, యష్టిమధు, చెంగల్వ కోష్టు, పసుపు, మానుపసుపు, కుటికీ, మంజిష్ఠా, పద్మకాష్టం, లొద్దుగచ, కరక్కాయ, నీల కమలం, తుత్తం, సుగంధిపాల ఇవన్నీ కలిపి ఒక భాగ ంగా, కల్కంగా సిద్ధం చేసిన దానికి నాలుగు రెట్లు నూనె, నూనెకు నాలుగు రెట్లు మంచినీళ్లు కలిపి 'తైలపాక విధి'లో ఆయుర్వేద నిపుణులు తయారుచేస్తారు.

ఉపయోగాలు:
చి లోతుగా ఉండే నాడీ వ్రణాలు (సైనస్), అగ్ని దగ్ధ వ్రణాలు, తీవ్రమైన భాధను కల్గించే వ్రణాలు, ఈ తైలంతో చేసే డ్రెస్సింగ్‌తో మానిపోతాయి.
చి విష జంతువుల కాటుతో ఏర్పడిన గాయాలు మొదలు కాళ్లూ చేతుల్లో మేకులు గుచ్చుకోవడం వల్ల అయిన గాయాల వరకు అన్ని రకాల గాయాలకూ ఈ తైలం ఉపశమనాన్నిస్తుంది.
 
సోమరాజీ తైలం
బావంచాలు, పసుపు, మానుపసుపు, తెల్ల ఆవాలు, చెంగల్వ కోష్టు, కానుగ విత్తులు, ఆరగ్వధ ఆకులు వీటి చూర్ణాలను నీటితో తడిపి ముద్దగా చేసి నాలుగు రె ట్లు నూనె, నూనెకు నాలుగు రెట్లు మంచి నీళ్లు కలిపి తైలపాక విధిలో ఆయుర్వేద వైద్యులు తయారు చేస్తారు.

ఉపయోగాలు :

  •  ఈ తైలంతో మర్ధన సమస్త చర్మ వ్యాధులకు, నాడీ వ్రణాలకు, దుష్టవ్రణాలకు ఉపయోగపడుతుంది.
  •   ముఖం పైన నల్లబొంగు లేదా మచ్చలు, దద్దులు రోజూ ఈ తైలంతో మర్ధన చేస్తే తగ్గిపోతాయి.
  •   ఒంటిపై దద్దులు, వృషణాలపై కచ్ఛూ ( చర్మం చెడడం) ఎగ్జిమా కూడా నివారింపబడుతుంది.
వజ్రిక తైలం
వజ్రి అనేది ఆకుజెముడు అని కూడా పిలిచే ఒక ఎడారిమొక్క . ఈ మొక్క నుంచి తీసిన పాలతో పాటు జిల్లేడి పాలు, ఉమ్మెత్త, చిద్రమూలం రసాలు, అలాగే గేదెపేడ రసం, ఆవుమూత్రం అన్నింటినీ ద్రవభాగంగా తీసుకుంటారు. దీనికి నాలుగో వంతు గంధకం, చిద్రమూలం, మనశ్శిల, తాలకం, విడంగం, అతివిష, వస్తనాభి, కోశాతకి, చెంగల్వకోష్టు, వచ, జఠామాంసి, త్రికటు, దేవదారు, యష్టిమధు, సర్జక్షారం, జీరక మూలికల చూర్ణాన్ని ముద్దగా చేసి కలుపుతారు. ఈ మొత్తం మిశ్రమాన్ని తైలపాక విధిని అనుసరించి తైలం మాత్రమే మిగులునట్లు తేలికపాటి మంటపై కాచి ఆయుర్వేద వైద్యులు తయారుచేస్తారు.

ఉపయోగాలు

ఈ తైలంతో రోజూ డ్రెస్సింగ్ చేస్తే దీర్ఘకాలికంగా వేధించే దుష్టవ్రణాలు (రాచపుండ్లు) కొద్ది వారాల్లోనే తగ్గిపోతాయి. ప్రత్యేకించి డయాబెటిక్ కార్బన్‌కుల్ట్, లెప్రసీ, గ్యాంగ్రిన్, వేరికోసిల్ అల్సర్, ఎగ్జిమా సమస్యలను సమర్ధవంతంగా తగ్గిస్తాయి. అయితే ఈ తైలంతో రోజూ డ్రెస్సింగ్ చేస్తూనే మరోవైపు ఆయా అల్సర్లకు సంబంధించిన ప్రధాన వ్యాధులకు కూడా కడుపులోకి కొన్ని మాత్రలు తీసుకోవాలి. అప్పుడే అవి పూర్తిగా తగ్గిపోతాయి. కొంత మందిలో ఉండే చెడు రక్తాన్ని జలౌకా విధానంలో తొలగించవలసి (రక్తమోక్షణ) రావచ్చు.  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top