![]() |
కావలసిన పదార్థాలు :
గుమ్మడి గింజలు - 300గ్రాబియ్యం - అర కేజీ
ఎండు మిరపకాయలు -8
నెయ్యి - 50గ్రా
పచ్చి మిరపకాయలు - 8
కొత్తిమీర - ఒక కట్ట
పుదీనా - ఒక కట్ట
బిర్యాని ఆకులు - నాలుగు
లవంగాలు - ఆరు
దాల్చిన చెక్క - కొద్దిగా
జీలకర్ర పొడి - ఒక టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టీ స్పూన్లు
మిరపపొడి - రెండు టీ స్పూన్లు
ఉప్పు - తగినంత.
తయారుచేయు విధానం :
ముందు రోజు గుమ్మడి గింజలను నానబెట్టుకోవాలి. ఒక గంట ముందు బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకోవాలి. తరువాత నానబెట్టిన గుమ్మడి గింజలను మెత్తగా రుబ్బుకుని అందులో మిరపపొడి, ఉప్పు, కొద్దిగా గరంమసాల వేసి బాగా కలుపుకొని పెనంపై దళసరిగా అట్టు మాదిరిగా వేసుకోవాలి. తరువాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక పచ్చి మిరపకాయలు, ఎండు మిర్చి, బిర్యాని ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి. కాసేపయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న గుమ్మడి గింజల అట్టును వేసి బాగా వేయించాలి.
కడిగి ఆరబెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లుపోసి జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి. అన్నం ఉడికిన తరువాత నెయ్యి వేసుకోవాలి. చివరగా దింపుకొనే ముందు పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఘుమఘుమలాడే గుమ్మడి గింజల బిర్యాని సిద్ధమైపోతుంది.