Kakarakaya Masala Curry: చేదు లేకుండా కాకరకాయ మసాలా కూర ఆంధ్రాస్టైల్ లో తయారీ.. ఎలా అంటే..!
కావలసిన పదార్దాలు
చిన్న కాకరకాయలు - పావుకిలో,
ఉల్లిపాయలు - 150 గ్రాములు,
కారం - 1 టేబుల్ స్పూన్,
గరంమసాల - 1 టేబుల్ స్పూన్,
నూనె- 3 టేబుల్ స్పూన్లు,
ఉప్పు - తగినంత
తాలింపు గింజలు - 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
కాకరకాయల్ని ఓ పక్క చీల్చి లోపల ఉన్న విత్తనాలను తీసెయ్యాలి. ఉల్లిపాయలు సన్నగా తరిగి, వాటికి ఉప్పు, కారం, గరంమసాలా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాకరకాయల్లో కూర్చి, బయటకు రాకుండా దారం కట్టాలి. పొయ్యి వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి కాగాక పోపు గింజల్ని వేగించాలి.
ఆ తర్వాత కాకరకాయల్ని కూడా వేసి పైన నీళ్ల గిన్నె మూత పెట్టి, సన్నని మంటమీద మగ్గించాలి. అది మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. గోల్డ్ కలర్ వచ్చేవరకు వేగించి దింపాలి.