బి.పి చూసే సెల్‌ఫోన్


రోజుకో కొత్తరకం టెక్నాలజీతో వస్తున్నాయిసెల్‌ఫోన్స్. జోడిస్తున్న ఫీచర్స్ కూడా అనంతం. సెల్‌ఫోన్‌ని థర్మామీటర్‌లా, బి.పి మెషిన్‌లా వాడుకునే విధంగా తయారుచేశారు కికిటాంగ్, డేనియల్ యూన్ అనే డిజైనర్స్. 'బ్లాక్ బెర్రి ఎంపతీ' పేరుతో వస్తున్న ఈ సెల్‌ఫోన్ మన శరీరానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనకి చెబుతుంది.

అంటే రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత, హార్ట్ పల్స్‌రేటు వంటివన్నీ మనకి ఎప్పుడు కావల్సిస్తే అపుడు చెబుతుంది. ఆసుపత్రికి వెళ్లకుండా మన శరీరంలోని విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా దీన్ని రూపొందించారు . ఈ మొబైల్‌తో పాటు ప్రత్యేకంగా తయారుచేసిన ఓ బయోమెట్రిక్ రింగ్‌ని ఇస్తారు.

దీన్ని బొటనవేలుకు తొడుక్కుని మొబైల్‌ని అరచేతిలో పట్టుకోగానే ఆ వ్యక్తి రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత, హార్ట్‌పల్స్‌రేటు వంటి సమాచారం టెక్ట్స్ మెసేజ్ రూపంలో వస్తుంది. మరికొద్ది రోజుల్లోనే దీన్ని మార్కెట్‌లోకి తెస్తామంటున్నారు సెల్‌ఫోన్ రూపకర్తలు. బ్లాక్‌బెర్రీ ఎంపతీ మన దగ్గరుందంటే బీపీ మెషిన్, థర్మామీటర్ మన చేతిలో ఉన్నట్టేనన్నమాట. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top