గాఢనమ్మకాలు - అపోహ - వాస్తవం

కసరత్తులు చేయడం, శరీరాన్ని కష్టపెట్టడం ఎందుకు? అని ప్రశ్నిస్తే రకరకాల సమాధానాలు వస్తాయి. అలాగే వాటి ఫలితాల గురించి ప్రశ్నించినా అంతే. ఎక్సర్‌సైజ్‌ల విషయంలో ఒక్కొక్కరి నమ్మకం ఒక్కోరకంగా ఉంటుంది. అయితే అవి గాఢనమ్మకాలైతేనే తంటా. ఫిట్‌నెస్ విషయంలో చాలా మందికి సర్వసాధారణంగా ఉండే అపోహలను ఫిట్‌నెస్ నిపుణులు ఇలా నివృత్తి చేస్తున్నారు.


1.అపోహ:పొట్ట భాగాన్ని చదునుగా మార్చడానికి సిటప్స్ (గుంజీల తరహా వ్యాయామం) ఒక మంచి మార్గం. 
వాస్తవం: సిటప్స్, క్రంచెస్... భారీ సంఖ్యలో చేయడం మాత్రమే పొట్టను చదునుగా చేసేందుకు సరిపోవు. అధిక బరువు తగ్గించాలంటే ఏదో ఒకటి రెండు వ్యాయామాలకు పరిమితం కాకుండా పూర్తి స్థాయి వెయిట్‌లాస్ ప్రోగ్రామ్‌ను ఆశ్రయించాల్సిందే.
2.అపోహ: వర్కవుట్ చేసేటప్పుడు పుస్తకాలు చదవడం ద్వారా శ్రమను మర్చిపోవచ్చు. 

వాస్తవం: వినోదం వరకూ నిజమే కావచ్చు కాని ఇది మీ అసలైన వ్యాయామ ఫలితాన్ని అడ్డుకుంటుంది. చదువుతూండడం వల్ల మీ భంగిమలో మార్పు చేర్పులు చోటు చేసుకోవడం, చేస్తున్న వ్యాయామానికి అవసరమైనంత మేర మీ దేహానికి శ్రమను అందించలేకపోవడంతో పాటు ఒక్కోసారి గాయాలకు కూడా కారణమవ్వచ్చు.


3. అపోహ: వె యిట్స్ అనేవి కేవలం బాడీబిల్డర్‌ల కోసమే.
 వాస్తవం: ఎముకలు, కీళ్లు దృఢంగా మారడానికి ప్రతి ఒక్కరికీ వెయిట్స్ ట్రయినింగ్ అవసరమే. దీనికి స్ర్తీ, పురుషులనే భేదం లేదు.
4. అపోహ: వారానికి మూడుసార్లు రన్నింగ్ చేస్తే చాలు ఎవరైనా ఫిట్‌గా మారతారు. 

వాస్తవం: మీరు వారానికి 3 సార్లు రన్నింగ్ చేస్తే మీ దేహం కేవలం రన్నింగ్‌కు సంబంధించి ఫిట్‌గా మారుతుంది అంతే. అన్ని రకాల వ్యాయామాలకు, శారీరక శ్రమకు కాదు.
5.అపోహ: ఎంత ఎక్కువ సేపు వ్యాయామం చేస్తే అంత ఎక్కువ బరువు కోల్పోతాం. 

వాస్తవం: పరిమితికి మించిన సమయం వ్యాయామం చేయడం వల్ల మీ దేహం అడ్రినలైన్, కొర్టిసొల్ వంటి ఒత్తిడి హార్మోన్లను తయారు చేయడం మొదలు పెడుతుంది. ఇవి మజిల్ టిష్యూలపై దుష్ర్పభావం చూపుతాయి. అధిక సామర్ధ్యంతో చేసే వ్యాయామం గుండె ఆరోగ్యానికి మేలు చేయవచ్చు కాని ఫ్యాట్ తగ్గడానికి కాదు.
6.అపోహ: వ్యాయామం పూర్తయ్యాక స్ట్రెచ్‌లు చేయడం అనవసరం వాస్తవం: వర్కవుట్ పూర్తయ్యాక స్ట్రెచింగ్ అనేది చాలా ఉపయుక్తం. వ్యాయామానికి ముందు ఉన్న స్థితికి దేహాన్ని చేర్చడానికి ఇవి తప్పనిసరిగా చేయాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top