![]() |
ఆపిల్పండ్లు - ఆరు, పంచదార - కప్పు, నెయ్యి - అర కప్పు, ఏలకుల పొడి - చిటికెడు, కిస్మిస్ - కొద్దిగా, జీడిపప్పు - పది పలుకులు, బాదంపప్పు - ఐదు (సన్నగా తరగాలి) కొద్దిగా
తయారి:
ఆపిల్ పండ్లను చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత ముక్కలను చేత్తో చిదమాలి. పాన్లో ఆపిల్ గుజ్జు, పంచదార వేసి సన్నని సెగపై ఉడకనిచ్చి మధ్యలో నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి. ఇంకొక బాణలిలో కాస్త నెయ్యి వేసి కిస్మిస్, జీడిపప్పు పలుకులు, బాదంపప్పు పలుకులను వేయించి ఉడుకుతున్న ఆపిల్ మిశ్రమంలో వేసి కలపాలి. మిశ్రమం చిక్కబడి దగ్గరగా వస్తుండగా ఏలకుల పొడి వేసి నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుని వేడి తగ్గిన తర్వాత కావలసిన షేప్స్లో కట్ చేసుకుని సర్వ్ చెయ్యాలి.