![]() |
బంగాళదుంపలు -100 గ్రా.
శనగపిండి - 150గ్రా.
కారం - అర టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 4
నూనె - డీప్ ఫ్రైకి తగినంత
ఉప్పు - తగినంత
వంటసోడా - చిటికెడు
తయారి:
బంగాళదుంపల మీద తొక్క తీసి నీళ్లతో శుభ్రంగా కడగాలి. వాటిని మనకి కావలసిన ఆకారంలో కొంచెం మందంగా కట్ చేసి ఒక్కొక్క దాని మీద కొద్దికొద్దిగా కారం, చాట్ మసాలా వేసి పక్కన ఉంచుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, ఉప్పు, కారం, తినేసోడా, నీరు పోసి బజ్జీలపిండిలా కలపాలి. స్టౌ మీద బాణలిలో నూనె కాగాక బంగాళదుంప ముక్కలను పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించి తీసేయాలి. వీటి మీద ఉల్లి తరుగు వేసి, గ్రీన్ చట్నీ కాంబినేషన్‌తో తింటే బావుంటాయి.