నాలుగు తాబేళ్లు పిక్నిక్కి వెళ్ళాయి. తీరా చూస్తే బ్రెడ్ ఉంది, జామ్ లేదు! చిన్న తాబేలును ఇంటికి వెళ్ళి తీసుకురమ్మన్నాయి. ‘‘నేవచ్చేవరకు మీరు బ్రెడ్ ముట్టుకోకూడదు మరి’’ అని బయలుదేరింది చిన్న తాబేలు. కానీ వారమైనా అది తిరిగి రాలేదు. చివరికి పెద్ద తాబేళ్ళు... ‘‘ఆ చిన్నది ఇక వచ్చేలా లేదు. ఈ బ్రెడ్ తినేద్దాం’’ అనుకున్నాయి. వెంటనే ఆ పక్కనే ఉన్న బండ చాటు నుంచి చిన్న తాబేలు బయటికి వచ్చి ‘‘అమ్మదొంగలూ! మీరిలా చేస్తారనే నేను వెళ్ళలేదు మరి ’’ అంది తాపీగా’’!