పొట్ట మీది చారికలు పోతాయా?

చారికలు ప్రాథమిక దశను దాటి గోధుమరంగు లేదా ముదురు గోధుమరంగుకు చేరినప్పుడు మాత్రం వీటిని అంత సులభంగా నయం చేయలేం. అటువంటప్పుడు లేజర్ చికిత్స్ అవసరమవుతుంది. లేజర్ కిరణాల సాయంతో చర్మంపై పొరను తొలగించి, కొత్తకొల్లాజన్ కణాలు పుట్టేటట్లు చేస్తారు.

కొందరు స్ర్తీలలో తొలి యవ్వన దశలో అంటే రజస్వల అయిన అనంతరం, బిడ్డ ఆరోగ్యంగా పుట్టేందుకు గర్భం ధరించినప్పటి నుంచి బలమైన ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకుండా ఉండటం, బిడ్డపుట్టిన తర్వాత కూడా అదేవిధమైన జీవన శైలికి అలవాటు పడటం వల్ల పొట్ట బాగా సాగి, ముడతలు పడుతుంది. ఈ విధంగా ఒక్క గర్భిణులకే కాదు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ, ఏ విధమైన ఎక్సర్‌సైజూ చేయకుండా, ఉండవలసిన దానికన్నా అధిక బరువు ఉండే ప్రతి ఒక్కరికీ ఆ విధంగా ముడతలు పడటం సహజం. వీరికే కాదు, స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకునేవారిలోనూ, అధికంగా ఎక్సర్‌సైజులు చేసేవారిలోనూ కూడా ఈ విధంగా చర్మం బాగా సాగి, చారికలు పడతాయి. అయితే అవి కొంతకాలానికి అంటే మామూలుగా రోజూవారీ పనులు చేసుకుంటూ, ఆహారంలో కొవ్వు తక్కువగా ఉండేట్టు చూసుకుంటూ, సహజ పద్ధతిలో బరువు తగ్గితే నెమ్మదిగా చర్మంలో కలిసిపోతాయి. కొద్దిమందిలో మాత్రం ఆ విధంగా కలవకుండా మచ్చల్లాగా, చారికల్లాగా ఏర్పడతాయి.
  

ఈ చారికలు ప్రాథమిక దశలో అంటే ఎరగ్రా లేదా గులాబీరంగులో ఉన్నప్పుడు వాటి మీద రెటినాయిడ్స్ ఉన్న క్రీములు, ఆల్ఫా హైడ్రాక్సీ ఆసిడ్స్, ఇంటెన్స్ మాయిశ్చరైజర్లు కొన్ని రకాల లేదా ప్రత్యేకమైన జెల్ అప్లై చేయడం వల్ల కొంతకాలానికి ఆ చారికలలో పేరుకొని ఉన్నమృతకణాలు (డెడ్‌సెల్స్) తొలగిపోయి, నెమ్మదిగా కొత్త కొలాజన్ కణాలు పుడ తాయి. చారికలు ప్రాథమిక దశను దాటి గోధుమరంగు లేదా ముదురు గోధుమరంగుకు చేరినప్పుడు మాత్రం వీటిని అంత సులభంగా నయం చేయలేం. అటువంటప్పుడు లేజర్ చికిత్స్ అవసరమవుతుంది. లేజర్ కిరణాల సాయంతో చర్మంపై పొరను తొలగించి, కొత్తకొల్లాజన్ కణాలు పుట్టేటట్లు చేస్తారు. ఇది కాస్తంత ఖర్చుతో కూడుకున్న చికిత్సావిధానం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top