అందమైన అమ్మాయీ... శాండ్‌విచ్ తయారు చేద్దామా...


కావల్సినవి:
యాపిల్‌ - ఒకటి
అనాస ముక్కలు - మూడు
సన్నగా పొడుగ్గా తరిగిన కొబ్బరిముక్కలు - నాలుగైదు
దానిమ్మ గింజలు- కొద్దిగా
రంగుల సోంపు - చెంచా (ఇది మార్కెట్లో దొరుకుతుంది)
బీట్‌రూట్‌  ముక్కలు - రెండు చిన్నవి

తయారీ:  
వెడల్పాటి పళ్లెం తీసుకోండి. యాపిల్‌ను ఒక భాగం నుంచి స్త్లెసులా కోయాలి. మరో భాగాన్ని సన్నగా పొడుగ్గా ముక్కలుగా కోయాలి. చక్రాల్లా తరిగిన అనాస ముక్క ఒకటి తీసుకుని పావు భాగాన్ని తీసేయాలి. మరో ముక్కను తీసుకుని జిగ్‌జాగ్‌గా ఉండే అంచుల్ని తొలగించి... చిన్న ముక్కలా చేసుకోవాలి. స్త్లెసులా తరిగిన యాపిల్‌ ముక్కను పళ్లెంలో ఉంచి.. అడుగున చాలా చిన్న అనాస ముక్క, ఆ తరవాత అంచులు తొలగించిన అనాస.. చివరగా సగం చక్రంలా ఉన్నదాన్ని ఒకదాని తరవాత ఒకటి పెట్టాలి. ఇప్పుడు మిగిలిన యాపిల్‌ ముక్కల్లో రెండింటిని పైభాగాన తిప్పి ఉంచి.. మరో రెండింటినీ స్త్లెసుకు రెండువైపులా ఉంచాలి. చివరగా కొబ్బరి ముక్కల్ని చేతులు, కాళ్లుగా అమరిస్తే సరిపోతుంది. కళ్లుగా  దానిమ్మ గింజల్ని ఉంచాలి. చిన్న యాపిల్‌ను తీసుకుని నోరు రూపంలో పెట్టాలి. కనుబొమల కోసం సన్నని బీట్‌రూట్‌ ముక్కల్ని ఉంచితే చాలు. ముచ్చటైన బొమ్మ తయారవుతుంది. అన్నీ సిద్ధంగా ఉంచుకుని పిల్లలతో తయారుచేయిస్తే వాళ్లకీ ఉత్సాహంగా ఉంటుంది. ఇష్టంగా తింటారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top