ఆర్డరిచ్చిన మెనూ వచ్చేవరకూ గంటల తరబడి వెయిట్ చేసే పనిలేదు.... శుచిగా, శుభ్రంగా వండుతున్నాడో లేదో.. అని అనుమానం అవసరం లేదు...
మనం తినాల్సింది ఎలా వండుతున్నారో ఇంట్లో కూర్చుని వెబ్ కెమెరాలో చూసేయవచ్చు. ఏమాత్రం నచ్చకపోయినా రెస్టారెంట్ వాళ్లని దులిపేయవచ్చు.
ఇదంతా ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? ఇంటర్నెట్‌ల వాడకం పెరిగిన తరువాత ఇప్పుడంతా టెక్నాలజీ మయమే. రెస్టారెంట్లో మనకు కావాల్సిన ఫుడ్‌ని ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేసే సౌకర్యం ఇప్పుడు వచ్చింది. హోటల్లో మనకు కావాల్సిన చోటును రిజర్వ్ చేసుకోగలిగే అవకాశం మాత్రమే మొన్నటివరకు ఉండేది. కాని ఇప్పుడు కొన్ని రకాల వెబ్‌సైట్లు ప్రపంచవ్యాప్తంగా మనకు నచ్చిన రెస్టారెంట్లో కావాల్సిన రోజు నచ్చిన వంటకాన్ని ముందుగానే బుక్ చేసుకునే వీలు కల్పిస్తున్నాయి.
కావాలంటే ఇంటివరకూ వచ్చి తీసుకెళ్లి, దింపేసే క్యాబ్ సౌకర్యం కూడా ఉంది. దీనివల్ల టైమ్ చాలా మిగులుతుంది. రెస్టారెంట్‌కి వెళ్లి ఆర్డరిచ్చాక మనకు తినాలనే కోరిక చచ్చిపోయిన తరువాత ఎప్పుడో తెచ్చిస్తాడు వెయిటర్. అలా గంటల తరబడి వెయిట్ చేసే సమయం చాలా మిగులుతుంది. అంతేకాదు.. భిన్న రుచులను ఆస్వాదించాలనుకున్నప్పుడు అవి ఎలా ఉంటాయో ఎలా వండుతున్నారో అన్నీ వెబ్ కెమెరా ద్వారా ఇంట్లో కూర్చునే చూడవచ్చు. ఆ తరువాతే మనకు నచ్చినవి ఆర్డర్ చేయవచ్చు.
ఈ సౌకర్యం ఉత్తర భారతంలో ఇప్పటికే చాలా రెస్టారెంట్లు అందిస్తున్నాయి.www.foodkamood.com, www.foodiebay.com, www.mhungry.in కల్పిస్తున్నాయి.
నెట్ రెస్టారెంట్
teluguLifestyle Editor
9:10:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.