మీరే తెలివైన ఇన్వెస్టర్!

From pane
ఇన్సూరెన్స్, మూచ్యువల్ ఫండ్స్, వివిధ బాండ్లలో పెట్టుబడులు పెట్టే సీజన్ ఇది. మిగిలిన వారిమాట ఎలా ఉన్నా ఉద్యోగులు పన్నుపోటును తగ్గించుకొనేందుకు ఈ రెండు మాసాల్లోనే వివిధ స్కీముల్లో పెట్టుబడులు పెడతారు. అయితే చాలామంది పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాల్లో తప్పులు చేసి, ఆ తరువాత నాలిక కరుచుకుంటూ ఉంటారు. పొదుపు పధకాలు, పెట్టుబడి స్కీములోల చేరేవారు ఎలాంటి తప్పులు చేస్తారు? పరిష్కారం ఏమిటనే అంశాలపై సూచనలివి.

  •  మన ఎదుట అనేక స్కీములు ఉంటాయి. ఏది మేలైనదో తెలియదు. నిర్ణయం తీసుకోవడం కష్టంగా మారుతుంది. చివరకు ఎక్కడా పెట్టుబడి పెట్టలేని పరిస్థితి తలెత్తుతుంది. అందుకే మీ అవసరాలకు తగిన స్కీములకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే సేకరిస్తే గందరగోళం ఉండదు.
  •   ఉన్న డబ్బు కాస్తా పెట్టుబడి పెట్టేస్తే అవసరం వచ్చినప్పుడు పరిస్థితి ఏమిటని కొందరు ఆందోళన చెందుతారు. ఆదాయం ఎంత? ఈ ఏడాది ఖర్చులు ఎంత? ఎంత పెట్టుబడి పెడితే ఇబ్బంది ఉండదనే ప్లానింగ్ లేక చాలా మంది తికమకపడుతూ ఉంటారు. డబ్బు వృధాగా దగ్గర ఉంచుకోవడం కంటే మంచి పథకాల్లోపెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చని గ్రహించాలి.
  •   పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో కొందరికి వారి మీద వారికి నమ్మకం ఉండదు. పక్కవారి నిర్ణయం మీద ఆధారపడి ఆ తరువాత పశ్చాత్తాప పడతారు. ఆలాకాకుండా పూర్తి సమాచారాన్ని స్వయంగా తెలుసుకొనే ప్రయత్నం చేయాలి.
  • ఇప్పటి నుంచే భవిష్యత్తు కోసం ఎందుకు ఆలోచించాలి? రిటైర్మెంట్‌కు ముందు ఆలోచిద్దాం అని చాలా మంది పొదుపును వాయిదా వేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందు నుంచి పొదుపు చేస్తే రిటైర్మెంట్ తరువాత జీవితం ఆనందకరంగా సాగుతుంది.
  •   పెట్టుబడి పెట్టిన వెంటనే లాభాలు రావాలనే ఆలోచనతో కొందరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని, నష్టపోతారు. సత్వర లాభాల కంటే స్థిరమైన లాభాలు వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి.
  •   మనకు తెలియని రంగాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు రాకపోగా ఆశాంతి మిగులుతుంది. మీరు పొదుపు చేసే స్కీముల గురించి క్షుణ్ణంగా తెలుసుకొని, ఆతరువాత రంగంలోకి దిగండి.
  •   పొదుపు, పెట్టుబడి విషయాల్లో మంద మనస్తత్త్వం అసలే పనికిరాదు. ఇప్పుడు ఈ పథకం ఆకర ్షణీయంగా ఉంది కదా అని దాని వెంట పడేకంటే భవిష్యత్తులో దాని పరిస్థితి ఎలా ఉంటుందో కూడా అంచనా వేస్తే మీరే తెలివైన ఇన్వెస్టర్ అవుతారు.
  •   ఇన్సూరెన్స్, మూచ్యువల్ ఫండ్స్ మదుపు విషయాల్లో ఎక్కువ మంది ఏజెంటు, సలహాదారుల మీద ఆధారపడతారు. దాని వల్ల గందరగోళం పెరిగి చివరికి నష్టపోతారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top