అసలు ఇక్కడ ఎయిర్ కండిషన్ లేనేలేదు కదా?

ఒక రెస్టారెంట్‌లో ఒక కస్టమర్ వెయిటర్‌కు తెగ పనిపెడుతున్నాడు.

మొదట వాతావరణం వేడిగా ఉందని ఎయిర్ కండిషన్ ఆన్ చేయమన్నాడు.

ఆ తరవాత మరీ చలిగా ఉందని ఆఫ్ చేయమన్నాడు.

ఈ తతంగం చాలాసేపు జరిగింది.

ఆశ్చర్యకరంగా వెయిటర్ చాలా ఓర్పును ప్రదర్శిస్తూ ఏమాత్రం చిరాకు పడకుండా చెప్పినట్టు చేస్తూవచ్చాడు.

పక్క టేబుల్లో కూర్చున్న మరో కస్టమర్ దీన్ని గమనించి వెయిటర్‌ను పిలిచి, ‘‘ఆయన ఇంత సతాయిస్తున్నా, నీకు చిరాకు కలగలేదెందుకు?’’ అని అడిగాడు.
 
‘‘ఓ... అదా నేను వీటినంతా అంతగా పట్టించుకోను సార్. అసలు ఇక్కడ ఎయిర్ కండిషన్ లేనేలేదు కదా?’’ అన్నాడు చిన్నగా నవ్వుతూ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top