ఇంట్లో వాజులో పువ్వులు తాజాగా ఉండాలంటే......


 తాజా పువ్వులను చూస్తే తనువు పులకిస్తుంది. అందుకే వాటిని ఇంట్లో వాజుల్లో అందంగా అమర్చుకుంటాం. మరి అవి వాడిపోకుండా ఎక్కువ సమయం తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?  
  • రంగురంగుల పువ్వులను సిద్ధం చేసుకున్నాక కాడల్ని అంగుళం మేర కత్తిరించాలి. ఆ తరవాతే అవి సగం మునిగేవరకూ నీళ్లు పోయాలి. ఈ పువ్వులు నాలుగైదు రోజులు తాజాగా ఉండాలంటే... అందులో ఆస్ప్రిన్‌ మాత్రను పొడిలా చేసి వేస్తే చాలు. పువ్వులు, ఆకులు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. అలానే రోజుకోసారి నీళ్లు మార్చుకొని పొడి వేస్తుండాలి.

  • వారానికోసారి వాజులను శుభ్రపరచుకోవాలి. వాటిని ముగ్గు పొడితో రుద్ది కడిగితే మురికి వదిలిపోతుంది. అలానే వాజులో నీళ్లు తీసుకుని ఒక రాగి నాణేన్ని వేసి చూడండి. పువ్వులుతాజాదనంతో వికసిస్తాయే తప్ప వాడిపోవు.
  • మీదగ్గర ఖాళీ అయిన హెయిర్‌ స్ప్రే సీసా ఉందా?అయితే అందులో నీళ్లు నింపి అప్పుడప్పుడు ఆకులు, పూరేకలపై చల్లుతూ ఉండండి. వాడిపోకుండాఉంటాయి.
  • శీతలపానీయాలు కూడా పువ్వులు వాడిపోకుండా కాపాడతాయి. పానీయాలు, సోడా వంటివి అందుబాటులో ఉంటే వాజులో కొద్దిగా వేయండి. అందులో ఉండే చక్కెరలు పువ్వులను తాజాగా ఉంచుతాయి.
  • కప్పు గోరువెచ్చటి నీటిలో మూడు చెంచాల పంచదార, రెండు చెంచాల వెనిగర్‌ కలిపి.. వాజులో పోయాలి. వెనిగర్‌ పువ్వులకు బ్యాక్టీరియా వ్యాపించకుండా కాపాడుతుంది. వారం రోజుల పాటు పువ్వులను మార్చుకోనక్కర్లేదు.
  • పుండ్లను శుభ్రపరిచే స్పిరిట్‌ కూడా చక్కగా పనిచేస్తుంది. వాజులో నాలుగు చుక్కల స్పిరిట్‌ వేశారంటే రోజూ నీళ్లు మార్చుతుంటే సరిపోతుంది. పువ్వుల అందం కొంచెం కూడా తగ్గదు.
  • పువ్వులు కొద్దిగా వడలినట్లు కనిపిస్తున్నాయా.. అయితే పువ్వుల్ని పూర్తిగా తొలగించాల్సిన అవసరంలేదు. అలా వడలిన రేకల్ని మాత్రమే కత్తిరించండి సరిపోతుంది. మరో రెండురోజులు పువ్వులు తాజాగా ఉంటాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top