చెమటలతో వచ్చే అనేక సమస్యలు-తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలు

చెమట పట్టడం ప్రతివారికి సర్వసాధారణం. టెన్షన్ పడినప్పుడు, భయపడినప్పుడు, బాగా ఆడినప్పుడు, ఎక్కువ పనిచేసినప్పుడు చెమట అధికంగా పడుతుంది. ఈ చెమట శరీరం మీద బిందురూపంలో కంటికి కనిపిస్తుంది. చిత్రమేమిటంటే చెమట గ్రంథులు మనుషులకు, ఇంకా ఏప్‌లకు మాత్రమే ఒంటినిండా ఉంటాయి.
చెమటకు మూలం
చెమట అనేది ఎక్రైన్ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అవుతుంది. మనిషి చర్మం మీద చెమట గ్రంథుల సంఖ్య అన్నది పుట్టినప్పుడే నిర్ణయమవుతుంది. పుట్టిన తరవాత కొత్తగా ఎక్రైన్ గ్లాండ్స్ అభివృద్ధి చెందవు. అయితే పుట్టాక రెండేళ్ల వయసు వచ్చేవరకు ఇవి పూర్తిస్థాయిలో పనిచేయవు. 


ఎక్రైన్ చెమట గ్రంథులు - పెదవులు, గోళ్లు, చెవి బయటి భాగం మినహా మిగతా శరీరమంతా వ్యాపించి ఉంటాయి. వీటి సంఖ్య (చదరపు సెంటీమీటర్లలో)... అరచేతులు, అరికాళ్ల ప్రాంతంలో 600 - 700, నుదిటి మీద 181, మోచేతి మీద 108, మోచేతి వెనుక భాగంలో 68 ఉంటాయి.
చెమట వల్ల ఉపయోగాలు
మనకు వేడి, ఒత్తిడి ఉన్నప్పుడు చెమట ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అది ఆవిరి అయ్యే ప్రక్రియలో శరీరాన్ని చల్లబరుస్తుంది. అంటే శరీరాన్ని చల్లగా ఉంచడానికి చెమట పట్టడం అవసరమన్నమాట. సాధారణంగా ఎక్కువ పని చే సినప్పుడు అరచేతులు, అరికాళ్లు తేమగా అవుతుంటాయి. చెమట ఎక్కువగా పట్టడం వల్ల చాలా సమస్యలు కలుగుతాయి. అధికంగా చెమట పట్టడాన్ని వైద్య పరిభాషలో ‘హైపర్ హిడరోసిస్’ అంటారు. ఇది రెండు రకాలు...

జనరలైజ్‌డ్ హైపర్‌హిడరోసిస్ (శరీరమంతా విపరీతమైన చెమట పట్టడం), లోకలైజ్‌డ్ హైపర్‌హిడరోసిస్ (శరీరంలోని కొన్ని భాగాలకు మాత్రమే చె మట పట్టడం).
జనరలైజ్‌డ్ హైపర్ హిడరోసిస్‌కి కారణాలు...
చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. అందువల్ల ఈ కాలంలో చెమట పట్టడం చాలా తక్కువగా ఉంటుంది. కాని వేసవిలో అంటే మార్చి నెల నుంచి వేడి మొదలవుతుంది. అప్పుడు చెమట పట్టడం ప్రారంభమవుతుంది. వేడి పెరిగే కొద్దీ చెమట కూడా ఎక్కువ అవుతుంటుంది. ఇది దాదాపు అందరిలోనూ ఉంటుంది.  



వ్యాయామం చేసిన తరవాత

వైరల్ ఫీవర్, మలేరియా, క్షయ... వీటి కారణంగా జ్వరం వచ్చి, తగ్గిన తరువాత

గుండెకు సంబంధించిన వ్యాధులు అంటే షాక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి సందర్భాలు

ఎండోక్రైన్ లేదా హార్మోనల్ డిజార్డర్స్ అంటే హైపర్ పిట్యుటరిజమ్, హైపర్‌థైరాయిడిజమ్, ఇన్‌కసులినోమా, మధుమేహం వంటి వ్యాధులు

లింఫోమా, కార్సినాయిడ్ సిండ్రోమ్ వంటి క్యాన్సర్లు

గర్భిణీ, మెనోపాజ్ దగ్గర పడినప్పుడు

స్థూలకాయం

మద్యం అధికంగా సేవించడం

ఫ్లూయాక్సిటిన్ వంటి మందుల వాడకం

పార్కిన్‌సన్స్, వెన్నెముక దెబ్బతినడం వంటి న్యూరలాజికల్ డిజార్డర్స్
లోకలైజ్‌డ్ హైపర్‌హిడరోసిస్‌లో రకాలు

ఎమోషనల్ ఆర్ ఎసెన్షియల్ హైపర్ హిడరోసిస్ (ఉద్వేగాలకు లేదా భయాలకు లోనైనప్పుడు అరచేతులు, అరికాళ్లలో చెమట పట్టడం)తో పాటు యాగ్జిలరీ హైపర్ హిడరోసిస్ (బాహుమూలాల్లో చెమట పట్టడం), గస్టెటరీ హైపర్ హిడరోసిస్ (వేడి లేదా ఘాటైన ఆహారం తీసుకునేటప్పుడు పెదవుల చుట్టూ, ముక్కు, నుదురు మీద, తలలో చెమట పట్టడం), పోస్టరల్ లేదా ప్రెజర్ హైపర్ హిడరోసిస్ (కుర్చీవంటి వాటిలో కూర్చున్నప్పుడు సీట్‌తో ఆనుకున్న ప్రాంతం మేరకు చెమట పట్టడం) వంటి రకాలు కూడా ఉంటాయి. అరచేతులు, అరికాళ్లలో చెమటపట్టడం (ఇమోషనల్ లేదా ఎసెన్షియల్ హైపర్‌హిడరోసిస్ లేదా హైపర్ హిడరోసిస్ ఆఫ్ పామ్స్ అండ్ సోల్స్) లక్షణాలు:

అరచేతులు, అరికాళ్లలో మాత్రమే అధికంగా చెమట పట్టడం వంశపారంపర్యంగా వస్తుంది.

వీరికి చెమట... వేసవిలో అధికంగాను, శీతాకాలంలో తక్కువగాను ఉంటుంది. ఒక్కోసారి చేతులు, కాళ్ల నుంచి చెమట నేల మీదకు ధారాపాతంగా కారుతూంటుంది.

చెమట పగటిపూట అధికంగా, రాత్రుళ్లు తగ్గుతూ, నిద్రలో పూర్తిగా తగ్గిపోతుంది.
ఇందులోనూ రెండు రకాలు.

కంటిన్యుయస్ స్వెటింగ్: 

చెమట నిరంతరాయంగా పడుతూనే ఉంటుంది. వేసవిలో ఈ పరిస్థితి అధికంగా ఉంటుంది.

ఫేజిక్ స్వెటింగ్:

ఏ చిన్న పని చేసినా, చిన్న ఒత్తిడికి లోనైనా నిరంతరాయంగా చెమట పడుతుంటుంది.  
హైపర్ హిడరోసిస్ ఆఫ్ పామ్స్ అండ్ సోల్స్ వల్ల కలిగే సమస్యలు:
నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బందిగా అనిపించడం

పిల్లలలో చెమట అధికంగా పట్టడం వల్ల వారు పరీక్షల సమయంలో బాగా ఇబ్బంది పడుతుంటారు. ఈ చెమట ఎక్కువ కావడం వల్ల ఒక్కోసారి జవాబుపత్రం చిరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే అటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు చేతికింద రుమాలు పెట్టుకుని రాస్తుంటారు

టెన్నిస్, క్రికెట్ వంటి ఆటలు ఆడే క్రీడాకారులకు చేతిలోంచి రాకెట్, బ్యాట్ జారిపోతుంటాయి. అందువల్ల వారు తరచుగా చేతులను తుడుచుకోవలసి వస్తుంది

ఆఫీసులో సరిగా పనిచేయలేకపోవడం

అందరి నుంచి దూరంగా ఉండాలనిపించడం

పార్టీలకు, ఫంక్షన్లకు హాజరు కావటానికి ఇబ్బందిపడటం షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి మొహమాటపడుతుంటారు

చెప్పులు జారిపోతుంటాయి. షూ అయితే కొంత నయంగా ఉంటుంది. సాక్స్ వేసుకోవడం వల్ల కొంతవరకు ఈ ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు. అయితే సాక్స్‌ని ఎప్పటికప్పుడు శుభ్ర పరుచుకోవాలి. లేదంటే చర్మవ్యాధులు వస్తాయి.
కాంటాక్ట్ డెర్మటైటిస్: 

చర్మానికి సంబంధించిన అలర్జీలు రావటం
పామ్‌ఫోలిక్స్: 
చర్మంపై చిన్నచిన్న నీటి బుడగలు వచ్చి దురదగా ఉండటం
పిటెడ్ కెరటోలైసిస్: 

చర్మానికి బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావటం
డెర్మటోఫైటోసిస్: 

చర్మంపై ఫంగల్ ఇన్‌ఫెక్షన్ ఏర్పడటం
చికిత్స... జాగ్రత్తలు...
చికిత్స:

వయసు పెరుగుతున్నకొద్దీ చెమట పట్టే సమస్య కొందరిలో దానంతట అదే తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గకపోతే ఈ కింద పేర్కొన్న చికిత్సలు చేస్తారు.
యాంటీ పెర్‌స్సిరెంట్లు: 

ఇవి చాలా రకాలు ఉన్నాయి. ఫార్మల్ డీహైడ్, గ్లూటరల్ డీహైడ్, 20% అల్యూమినియం క్లోరైడ్ హెగ్జాహైడ్రేట్. వీటిని డాక్టరు సలహా మేరకు వాడాలి. యాంటీపెర్‌స్పిరెంట్స్ ఎక్కువ వాడటం లేదా డాక్టర్ సలహా లేకుండా సొంతంగా వాడటం వల్ల కాంటాక్ట్ డెర్మటైటిస్ అనే అలర్జీ వస్తుంది. బట్టలమీద ప్రభావం చూపి, అవి చిరిగిపోవచ్చు.
అయన్‌టోఫోరోసిస్: 

కరెంటు ద్వారా చేసే చికిత్స
బోట్యులినమ్ టాక్సిన్: 

ఇంజక్షన్ల ద్వారా చేసే చికిత్స
శస్తచ్రికిత్స: 

సింపథెక్టమీ అనే ఆపరేషను చేయడం
డియోడరెంట్లు: 

చెమటను నిరోధించవు కాని, చెమట వల్ల వచ్చే దుర్వాసనను మాత్రమే అరికట్టడానికి ఉపయోగపడతాయి. 
జాగ్రత్తలు:
చెమట ఎక్కువగా పట్టేవారు రోజూ రెండు సార్లు స్నానం చేస్తే మంచిది

మాయిశ్చరైజర్ సబ్బులు వాడేవారిలో చెమట ఎక్కువ పడుతుంది. అలాంటి వారు నార్మల్ సబ్బులు వాడాలి నూలు వస్ర్తాలు ధరించాలి

ఎప్పటికప్పుడు పరిశుభ్రమైన వస్ర్తాలు ధరించాలి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ, కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే చెమట సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు.
 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top