![]() |
‘నిన్ను మించినోడు లేడు నీకు నేనే పెద్ద ఫ్యాన్’ని అంటూ నిత్యం చరణ్ ని ఆకాశానికి ఎత్తేసే అల్లు అర్జున్ తన చచ్చు సలహాలతో చరణ్ ని పూర్తిగా రాంగ్ రూట్ పట్టించేస్తున్నట్టు భోగట్టా. మంచి కథలు చెబితే తాను చేస్తూ, కాస్త తక్కువ రేంజ్ కథలుంటే చరణ్ కి చెప్పమని చెబుతున్నాడట. అంతే కాక సదరు కథలు చాలా బాగున్నాయని చరణ్‌ని భ్రమపెడుతున్నాడని సమాచారం. అల్లు అర్జున్ ని గుడ్డిగా నమ్ముతున్న చరణ్ ఇప్పటికే కొన్ని కథల విషయంలో బోల్గా పడ్డాడని, ఇదే కొనసాగి ఆయా సినిమాలు విడుదలైతే మాత్రం చరణ్ తెచ్చుకున్న ‘మగధీర’ పేరంతా త్వరగానే కోల్పోతాడని బన్నీ తర్వాత చరణ్ అని అభిమానులు కూడా అనుకునే స్థాయికి దిగజారిపోతాడని అంటున్నారు.

