వాటర్ మిలాన్ షర్బత్


కావలసిన పదార్థాలు
వాటర్‌మిలాన్ - చిన్న సైజు కాయ, నిమ్మరసం - నాలుగు టీ స్పూన్‌లు, స్ట్రాబెర్రీలు - అర కప్పు, వైట్ చాక్‌లెట్ చిప్స్ - అర కప్పు. ఐస్ - ఒక కప్పు.

తయారుచేసే విధానం
ముందుగా వాటర్‌మిలాన్‌ను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. విత్తనాలను స్పూన్ సహాయంతో తొలగించుకోవాలి. తరువాత వాటర్‌మిలాన్ ముక్కలను, ఐస్ క్యూబ్స్‌ని మిక్సీలో వేసి పట్టుకోవాలి. తరువాత నిమ్మరసం, స్ట్రాబెర్రీలు వేసి మరి కాసేపు మిక్సీలో పట్టుకోవాలి. జ్యూస్‌ని గ్లాసుల్లో పోసిన తరువాత చాక్‌లెట్ చిప్స్‌తో అలంకరించుకోవాలి. అంతే... వాటర్‌మిలాన్ షర్బత్ రెడీ. వేసవికాలంలో ఈ జ్యూస్ తాగితే చల్లదనంతో పాటు ఆరోగ్యానికి మంచిది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top