చలచల్లని ఇంటికి......కొన్ని జాగ్రత్తలు

వేసవికాలం వచ్చిందంటే చాలు వేడిపై యుద్ధం ప్రకటించాల్సిందే. అందుకు ఎయిర్ కండిషనర్లు, కూలర్లు, వట్టివేళ్లు అంటూ ఎన్నో పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఇవి మరింత చల్లదనం ఇవ్వాలంటే ఇంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి మీ కోసం...

  • వేసవిలో ఇంటి పై కప్పుకు వైట్ పెయింట్ వేయించుకోవాలి. తెలుపు రంగు పెయింట్‌కి ఉన్న పరావర్తన గుణం వల్ల గదులు చల్లగా ఉంటాయి. ఈ ఇంట్లోకి నేరుగా సూర్యకిరణాలు పడే సమయంలో కిటికీ తలుపులు మూసేసి... సాయంత్రం వాతావరణం కాస్త చల్లపడిన తరువాత కిటికీలు తెరిచి ఉంచాలి. ఇలా చేయడం వల్ల గదుల్లో వేడి బయటకు పోయి ఇల్లు చల్లగా ఉంటుంది.


  • తెలుపు రంగు వేడిని పరావర్తనం చేస్తుంది కనుక అదే రంగు విండో షేడ్లు, కర్టెన్లు, బ్లైండ్స్ కిటికీలకు పెడితే వేడి లోపలికి రాకుండా నిరోధించొచ్చు. బ్లైండ్స్, షేడ్స్, కర్టెన్లను అమర్చిన తూర్పు వైపు కిటికీలను ఉదయం, పడమర వైపు కిటికీలను సాయంత్రం మూసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల వేడి బయటనే ఉండి ఫ్యాన్లు, ఎయిర్ కండీషనర్లు తక్కువ శక్తిని వినియోగించుకుని ఎక్కువ చల్లదనాన్ని ఇస్తాయి.

ఇంటి లోపలి ఉష్ణోగ్రతను తగ్గించాలి

  •  ఎలక్ట్రిక్ గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, లైట్లు ఇంటి లోపల వేడిని జనింపచేస్తాయి. అందుకని ల్యాంప్స్, టెలివిజన్ వంటి ఉష్ణాన్ని జనించే పరికరాలను ఎయిర్ కండిషనింగ్ థర్మోస్టాట్ పక్కన లేకుండా చూసుకోవాలి.
  •   ఎక్కువ కాంతిని ఇచ్చే లైట్లు వాడకపోవడం మంచిది. అలాగే ఉష్ణాన్ని జనింపచేసే పరికరాలను కూడా వాడకూడదు. ఎక్కువ వెలుగు కోసం ఫ్లోరోసెంట్ బల్బులు వాడొచ్చు. ఇవి ఐదో వంతు శక్తిని వినియోగించుకుని తక్కువ ఉష్ణాన్ని విడుదల చేస్తాయి.
  • వేసవిలో వంట విషయంలో కూడా జాగ్రత్తవహించాలి. వాతావరణం వేడెక్కకముందే వంట పూర్తిచేసుకోవాలి. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో వేడిని తగ్గించుకోగలిగితే అప్పుడు తక్కువ ఎనర్జీతో ఇంటిని చల్ల పరుచుకునే అవకాశం ఉంటుంది.
మొక్కలతో మ్యాజిక్ చేయొచ్చు

  • దక్షిణ, పడమర దిశల్లో మొక్కలు నాటితే ఇల్లు చల్లగా ఉంటుంది.
  •   చిన్న చిన్న కుండీల్లో పెంచుకునే మొక్కలు కంటికి హాయినిస్తాయి. చూపును మెరుగుపరుస్తాయి. పచ్చదనం మనసుకు ఉల్లాసాన్నిస్తుంది కూడా.
  • మొక్కల వల్ల స్వచ్ఛమైన గాలిని పీల్చే అవకాశం ఉంటుంది. ఇంటిలోపల స్థలం ఉంటే డెకరేటివ్ పాట్స్ లేదా స్టాండుల్లో ఇండోర్ ప్లాంట్స్ అమర్చుకోవచ్చు.
  • ఇండోర్‌ప్లాంట్స్ వేరు భాగాల్ని శుభ్రం చేసి నీళ్లు నింపిన వేజుల్లో కూడా ఉంచొచ్చు.
  • మొక్కలు ఉన్న దగ్గర పగటి ఉష్ణోగ్రతలు మొక్కలు లేని ప్రాంతంతో పోలిస్తే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా ఉంటాయి. అందుకని గో గ్రీన్... 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top