కమనీయ జలపాతం.. కైగల్‌

చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో కొండల పై జాలువారే నీటి ప్రవాహంతో చూపరులను ఇట్టే ఆకర్షించే కైగల్‌ దుముకురాళ్ళ జలపాతాన్ని ఒక్కసారి చూశారంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా జలపాత అందాలు ఆకట్టుకొంటాయి. చిత్తూరు జిల్లాలోనే ప్రఖ్యాత పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా పేరొందిన కైగల్‌ దుముకురాళ్ళ జలకళతో పర్యాటకులకు కనువిందు చేస్తోంది. వేసవిలో సైతం ఈ జలపాతం నీటితో కళకళలాడటం విశేషం. జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉన్న సమయంలో కూడా పొరుగు రాష్టమ్రైన కర్నాటకలో కురిసే వర్షాలతో ఈ జలపాతం ఎప్పుడూ నిండుగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. కైగల్‌ జలపాతానికి నీరు వచ్చే యేరు కర్నాటక రాష్ట్రం నుండి ప్రారంభం కావడమే దీనికి కారణం.

ఒక్కోసారి వర్షాలు తక్కువగా కురిసిన సందర్భాలలో జలపాతంలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటం వలన పర్యాటకుల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. కాని ఈ వేసవి ప్రారంభం నుంచే జలపాతంలో నీరు ప్రవహిస్తూనే ఉండడంతో ఈ సంవత్సరం పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన కైగల్‌ జలపాతాన్ని చూడడానికి వచ్చే పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ప్రతి ఏటా ఎండలు ఎక్కువగా ఉండే ఏప్రిల్‌, మే మాసాల్లో ఈ జలపాతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.



వేసవి సెలవుల్లో విద్యార్థులే కాకుం డా ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో ఇక్కడి అందాలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున వేంచేస్తుంటారు. ఈ అందమైన జలపాతాన్ని చూడడానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరం రాళ్ళు, రప్పల మధ్య నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. జలపాతానికి వెళ్ళడానికి సరైన రోడ్డు లేకపోవడంతో పాటు జలపాత ప్రాంతంలో సందర్శకులకు ఎటువంటి సౌకర్యాలు లేవు. అయినపటికీ ఇక్కడికి వచ్చే పర్యాటకుల తాకిడి మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు. పర్యా టకులు ఈ ప్రదేశానికి రావడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తారు. మొత్తానికి ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే ఏదో సాహసయాత్ర చేసినట్లుగా అనుభూతి చెందుతారు. పిల్లలు, పెద్దలు అందరూ ఏకం అయి ఇక్కడి జలపాతంలో స్నానాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తారు. బోటు షికారు ఏరాటు చేస్తే మరింతమంది పర్యాటకులను ఆకర్షించవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top