కావల్సినవి:
బొప్పాయి- ఒకటి(పెద్దది), పంచదార- కప్పు, యాలకుల పొడి- అరచెంచా, నెయ్యి- ఆరుచెంచాలు, మైదా- పావుచెంచా, జీడిపప్పు- పది
తయారీ:
ముందుగా బొప్పాయిని శుభ్రంగా కడిగిచెక్కు తీసి ముక్కలు కోయాలి. వాటిని మిక్సీలో వేసి బాగా గుజ్జుగా చేయాలి. ఇప్పుడు మందపాటి అడుగు ఉన్న పాత్రను తీసుకొని పొయ్యి మీద పెట్టాలి. అది వేడయ్యాక బొప్పాయి గుజ్జు, పంచదార వేయాలి. కొద్దిసేపటికి పంచదార కరిగి మిశ్రమం ఉడుకుతుంటే మైదాలో కాసిని నీళ్లు కలిపి అందులో చేర్చాలి. మిశ్రమం కాస్త గట్టిగా అయ్యాక నెయ్యి, యాలకుల పొడి చేర్చి దించేయాలి. తరవాత నేతిలో వేయించిన జీడిపప్పుతో అలంకరించుకొంటే బొప్పాయి హల్వా సిద్ధమయినట్టే. దీన్ని ఫ్రిజ్లో పెట్టి చల్లచల్లగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది. తియ్యగా ఉండే బొప్పాయిని ఎంచుకున్నప్పుడు పంచదార కాస్త తక్కువ వేసుకోవాలి.