కావల్సినవి:
కొబ్బరి కోరు- కప్పు, పంచదార- కప్పు, పచ్చిమామిడి కోరు- అరకప్పు, మైదాపిండి- రెండు కప్పులు, నూనె- వేయించడానికి సరిపడా, బాదం, జీడిపప్పు- పావుకప్పు, ఉప్పు- చిటికెడు
తయారీ:
బాణలిలో కొబ్బరి, మామిడికోరు, పంచదార తీసుకొని పొయ్యి మీద పెట్టాలి. కొద్దిసేపటికి పంచదార కరిగి కొబ్బరి, మామిడి కోరు ఉడికి దగ్గర పడుతుంది. అప్పుడు కలిపి కొద్దిసేపటికి దించేయాలి. మైదాలో కొద్దిగా కాచిన నూనె, చిటికెడు ఉప్పు జోడించి నీళ్లతో చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. గంట తరవాత మైదా ముద్దను చిన్నచిన్న పూరీల్లా ఒత్తుకొని మధ్యలో తియ్యని కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి కజ్జికాయల్లా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టి వేడయ్యాక వాటిని వేయించుకోవాలి. గోధుమవర్ణంలోకి వచ్చాక దించేస్తే కట్టా మీఠా కజ్జికాయలు సిద్ధమయినట్టే.