కిడ్నీలో రాళ్లు మందులతో మాయం

కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు తేలగానే బెంబేలెత్తిపోతారు. ఎక్కడ శస్త్ర చికిత్స అంటారోనన్న భయం మనసును కుదిపేస్తుంది. నిజానికి ఆహారపానీయాల విషయాల్లో జాగ్రత్త పడితే అసలీ సమస్యే ఉండదు. మూత్ర పిండాలు చేసే ప్రక్రియలో సమతుల్యత లోపించినప్పుడు వ్యర్థపదార్థాలు సూక్ష్మమైన స్ఫటికాలుగా మారతాయి.

ఇవి ఒకదానికొకటి అంటుకుని చివరికి రాళ్ళుగా తయారవుతాయి. ఈ రాళ్లు వెంటనే నష్టం కలిగించవు. ముందుగా అతి సూక్ష్మమైన స్పటికాలు తయారై కొన్నేళ్లు గడిచిన తరువాత ఒక రాయిగా మారతాయి. వాస్తవానికి 70 శాతం వరకు రాళ్లు మూత్రంతో పాటే బయటకు పోతాయి. మిగతా 30 శాతం మాత్రం మూత్ర పిండాలు, మూత్ర నాళాలు, పిత్తాశయం (బ్లాడర్) వీటిల్లో ఎక్కడో ఒక చోట ఉండిపోతాయి.
 

ఏమిటా కారణాలు?
వంశానుగ తంగా వచ్చే జన్యుపరమైన కారణాలు కొన్ని అయితే, ఉష్ణ ప్రదేశాల్లో నివాసం, ఉదర సంబంధ సమస్యలకు తరుచూ మందులు వాడటం, అలాగే అతిగా స్టెరాయిడ్స్ తీసుకోవడం. క్యాల్షియం, ఫాస్ఫేట్స్, ఆక్సలేట్స్ రక్తంలో అధికంగాఉండడం వంటివి కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి.అలాగే, అతిగా మాంసాహారం తీసుకోవడం. విటమిన్-సి, డి, బి-6 లోపించడం, శరీరంలో విటమిన్-డి ఎక్కువగా ఉండడం,మూత్ర పిండాల్లో ఇన్‌ఫెక్షన్లు, క ంతులు ఉండడం, తగినన్ని నీళ్లు తాగకపోవడం. అలాగే అతిగా మద్యం సేవించడం వల్ల కూడా రాళ్లు ఏర్పడతాయి.

జాగ్రత్తలేమిటి?
ఈ రాళ్లు ఏర్పడ డానికి మన ఆహారపు అలవాట్లే ముఖ్య కారణం. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే ముఖ్యంగా చేయవలసిన పని.

ఈ ఆహారంలో క్యాల్షియం మోతాదు తగ్గించడం, ఆక్సలేట్లు అధికంగా ఉండే చాక్లెట్లు, పాలకూర, టమాట, బీట్‌రూట్, స్ట్రాబెర్రీ ఉన్న పదార్థాలు తగ్గించాలి.

ఈ ఆరోగ్యవంతులు రోజుకు మూడు లీటర్ల నీళ్ళు తాగితే సరిపోతుంది. కానీ, కిడ్నీలో రాళ్ళు ఏర్పడిన వారు కనీసం 5 లీటర్ల నీళ్లు తాగవలసి ఉంటుంది. అయితే, చల్లని నీరు గానీ, ఇతర చల్లని పానీయాలు గానీ తీసుకోకూడదు. ఈ క్యాల్షియం రాళ్ళు ఉన్న వారు ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి.



ఈ ప్రొటీన్లు తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడకుండా నియంత్రించవచ్చు. రాళ్లను నిర్లక్ష్యం చేస్తే, వాటి పరిమాణం పెద్దదై మూత్ర విసర్జన పెద్ద సమస్యగా మారుతుంది. మూత్ర నాళం సన్నగా మారడం, ఇన్‌ఫెక్షన్లు రావడం, ఒక్కోసారి క్యాన్సర్ వ్యాధికి కూడా ఇది దారితీయవచ్చు.

నిర్ధారణ పరీక్షలు
యూరిన్ అనాలసిస్, యూరిన్ కల్చర్, ఎక్స్‌రే-కె.వి.9, అల్ట్రా సౌండ్ వంటి పరీక్ష'ల ద్వారా మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్నాయో లేదో స్పష్టంగా తెలిసిపోతుంది. నీళ్లు ఎక్కువగా తాగితే చాలా మందిలో రాళ్లు వాటంతట అవే మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు ఆ రాళ్లను సేకరించి పరీక్షలకోసం ఒక బట్టలో పట్టి ఉంచాలి. అవి ఏ రకం రాళ్లో పరిశీలించి ఏ ఆహార పదార్థాలు తీసుకోకూడదో డాక్టర్లు సూచిస్తారు. హోమియో వైద్యవిధానం ద్వారా శస్త్రచికిత్స అవసరం లేకుండా కేవలం మందులతోనే రాళ్లను తొలగించవచ్చు. ఇకపై మళ్ళీ రాకుండా కూడా నియంత్రించవచ్చు.


చికిత్స...
హోమియో మందులతో రాళ్లు కరిగిపోవు. కానీ మూత్ర నాళాన్ని మందులు విశాలం చేస్తాయి. దీని వల్ల ఒకటి రెండు సెంటీ మీటర్ల పరిమాణం గల రాళ్లు మూత్ర నాళంలోంచి బయటికి వెళ్ళిపోతుంటాయి.

బర్బారిస్ వల్గారిస్:

నొప్పి నడుములో మొదలై, గజ్జల వరకూ రావడం. నొప్పి మరీ అధికమై లేస్తూ, కూర్చుంటూ నానా అవస్థలూ పడుతున్నప్పుడు ఈ మందు బాగా పని చేస్తుంది.

లైకోపోడియమ్: 

మూత్రంలో మంట, మూత్ర నాళంలో ఇసుక పోసినట్లు ఉండడం, మూత్రం చేయగానే నొప్పి తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

టెరిబింత్:

మూత్రపిండ ంలో నొప్పితో పాటు మూత్రం తెల్లగానూ, రక్తపు చారలతోనూ ఉంటే ఈ మందు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మ్యాగ్ ఫాస్: కడుపులో నొప్పి అధికంగా ఉన్నప్పుడు ఈ మందు చాలా త్వరితంగా ప్రభావాన్ని చూపిస్తుంది.

కోలోసింథ్:

పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా ఉండడం వల్ల ఎప్పుడూ వంగిపోతుంటారు. అలాంటి వారికి ఇది చాలా ఉపయుక్తమైన మందు. నిజానికి చాలా మందికి మూత్రాశయంలో రాళ్ళు ఉంటాయి. అక్కడ అవి ఉండడం వల్ల ప్రమాదం కూడా ఏమీ  ఉండదు. రాయి మరీ పెద్దదై నప్పుడు అది మూత్రనాళంలో ఆటంకాలను తెస్తే తప్ప రాళ్లు మూత్రాశయంలో ఉండిపోతే వచ్చే నష్టమేమీ లేదు. మూత్ర నాళంలో రాయి అడ్డుపడి భరించ లేని నొప్పి వస్తే తప్ప శస్త్రచికిత్సకు వెళ్లకపోవడమే మంచిది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top