హోమియోపతి మందుల కిట్‌లో ఉండవలసిన మందులు

తాత్కాలిక ఉపశమనానికి ఇంట్లో హోమియోపతి మందుల కిట్ ఉండటం మంచిదే, అవసరాన్నిబట్టి మందులు వేసుకొనవచ్చు. అయితే దీర్ఘకాలిక వ్యాధులకు మాత్రం తప్పని సరిగా హోమియో వైద్యుని ఆధ్వర్యంలో మందులు వాడాలి. అదేవిధంగా ముందు నుండే హోమియో వైద్యుని ఆధ్వర్యంలో మందులు వాడుతున్నవారు, తాత్కాలిక ఉపశమనానికి ఈ మందులు వాడాలంటే తమ హోమియో వైద్యుని సలహా తప్పకుండా తీసుకోవాలి.

ఆర్సెనిక్:
 

అన్ని రకాల జలుబు, ముక్కునుండి నీరు కారడం, తుమ్ములు, జ్వరం, ఒళ్లు మంటలు, భయం, కడుపులో నీళ్లు నీళ్లుగా ఉండి కడుపు ఉబ్బరంగా అనిపించడం, ఆహారాన్ని వాసన చూసినా కూడా వాంతి వచ్చినట్లుగా అనిపించడం, ముక్కునుండి, కంటి నుండి నీరు కారడం, మోషన్స్, డిశ్చార్జ్‌లు అన్నీ ముదురు రంగులో, దుర్గంధంతో కూడుకుని ఉంటాయి. ముఖ్యంగా మధ్యరాత్రి, మిట్ట మధ్యాహ్నం ఈ సమస్యలు ఎక్కువ అవుతున్నా ఈ మందును వాడవచ్చును.

ఆర్నికా:
 

కముకుదెబ్బలకు, రక్తం బయటికి రాకుండా చర్మం కమిలినట్లుగా ఉండే వాపులకు, నడుము నొప్పి, దెబ్బలు తాకడం వంటి అన్ని రకాల సమస్యలకు వాడవచ్చు.

ఏపిస్‌మెలిఫికా: 
తేనెటీగ, కందిరీగ, ఇంకేవైనా పురుగుల కాటు,్ల కాళ్లు, చేతులు, ముఖం వాపులు, మధ్యరాత్రుల్లో వచ్చే చలిజ్వరానికి.

బెల్లడొనా:
 

తలనొప్పి, తలభారంగా అనిపించడం, చలి, జ్వరం, దగ్గు ఉన్నప్పుడు వాడవచ్చును.

బ్రయోనియా:
 

నోరు ఎండిపోవడం, ఏ మాత్రం కదిలినా నొప్పులు ఎక్కువ అవడం, మోషన్స్ ఎండినట్లుగా గట్టిగా ఉండి, ముక్కినప్పుడు రక్తం రావడం.

కార్బోవెజ్:
 

గ్యాస్ వలన ఛాతీలో భారంగా అనిపించడం, తేనుపులు, ఆయాసం.

సీనా:
 

పిల్లల కడుపులో నులిపురుగులు, పళ్లుకొరకడం, పేచీ పెట్టడం.

కోక్యూలస్:
 

కారు, బస్సు, ఓడ ప్రయాణాలలో వాంతి రాకుండా వాడవచ్చు.

లైకోపోడియం:
 

పొత్తికడుపు ఉబ్బరంగా ఉండటం, అన్ని రకాల గ్యాస్‌కు సంబంధించిన సమస్యలు, మూత్రంలో ఎర్రని ఇసుక రావటం, కుడివైపుకు సంబంధించిన అన్ని సమస్యలకు.


నక్స్‌వామికా: 
అన్ని జీర్ణ సంబంధిత సమస్యలకు, ఆల్కహాల్ సేవించడం వలన కలిగే హ్యాంగోవర్‌ను తగ్గించడానికి, మసాలాలు తినడం వలన వచ్చే ఆయాసాన్ని తగ్గించడానికి వాడవచ్చును.

రస్టాక్స్:
 

అన్ని రకాల కీళ్లు, కండరాలు, నడుము, మెడ, చేతులు, కాళ్లనొప్పులు, కాళ్లు లాగడం, తిమ్మిర్లు, జ్వరం, దగ్గు జలుబు, వాతావరణ మార్పుల వలన కలిగే అన్ని సమస్యలకు ముఖ్యంగా వర్షంలో తడవడం వలన వచ్చే జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి దాదాపు అన్ని సమస్యలకు ఈ మందును వాడవచ్చును.

మెర్క్‌సాల్:
 

నోటిపూత, నోటినుండి దుర్గంధం, మోషన్స్‌లో రక్తం, దుర్గంధం ఉన్నప్పుడు

సల్ఫర్:
 

చర్మ సంబంధిత వ్యాధులు, దురద, రక్తస్రావం, మలబద్దకం వంటి అన్ని సమస్యలకు.

హోమియోలో చాలా మందులున్నప్పటికీ పైన తెలిపిన మందులు కిట్‌లో ఉంచుకోవచ్చును. అన్ని మందులు 30 లేదా 200 పొటెన్సీలో వాడవచ్చును. ఏ మందైనా ఒకే సమస్యకు అదే పనిగా దీర్ఘకాలం వాడటం వలన ఫలితం ఉండదు. కేవలం తాత్కాలిక ఉపశమనానికి మాత్రమే వాడాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top