భాగవతం, రామాయణం, భారతం...ఇవి ప్రధానంగా ఉపదేశించే మంత్రాలేవి?


మహాభాగవతం అష్టాక్షరీ మంత్రాన్ని ప్రతిపాదించి విపులంగా విశదీకరిస్తుంది. దీన్ని మొదట భగవంతుడు నరునకి బదరికాశ్రమంలో ఉపదేశిస్తారు. శ్రీరామాయణం ద్వయ మంత్రార్థాన్ని విశదీకరిస్తుంది. దీనిని భగవానుడు లక్ష్మీదేవికి విష్ణులోకంలో ఉపదేశిస్తాడు. ఇదే కఠోపనిషత్తులో తెలుపబిన ద్వయ మంత్రం. 'చరమశ్లోక తాత్పర్యగ్రాహకం భారతం మహత్! మహాభారతం చరమశ్లోకార్థాన్ని తెలియజేస్తుంది.

ఇది శ్రీకృష్ణభగవానుడు అర్జునునికి మహాభారత యుద్ధసమయంలో భగవద్గీతలో చరమ ఉపాయంగా ఉపదేశిస్తాడు. చరమశ్లోకం అంటే భగవద్గీతలోని చివరిశ్లోకం అని అర్థం కాదు. చివరి ఉపాయాన్ని ఉపదేశించడం వల్లే దీన్ని చరమశ్లోకం అంటారు. 'సర్వధర్మాన్ పరిత్యజ్య'అనేదే ఈ శ్లోకం. శ్రీరామాయణం బహు సకరమైన శరణాగతిని బోధిస్తుంది. అందుకే శ్రీరామాయణానికి 'దీర్ఘశరణాగతి శాస్త్రం' అనే పేరు వచ్చింది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top