సోయాతో హై బి.పికి చెక్


అధిక రక్తపోటుతో బాధపడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఎవరిని పలకరించినా హై బి.పి ఉందని అంటున్నారు. పని ఒత్తిడి, శారీరకశ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, స్థూలకాయం...అధికరక్తపోటుకు కారణమవుతున్నాయి. కారణం ఏదైనా బి.పి పెరిగిపోయి ప్రమాదకర పరిస్థితి వచ్చే వరకు గుర్తించలేకపోతున్నారు. అనుకోకుండా జరిపిన పరీక్షల్లో హై బి.పి ఉన్నట్లు తేలడం ఆందోళనకు గురిచేస్తోంది.

బి.పి ఉందని తెలిసిన తరువాత దాన్ని తగ్గించుకోవడానికి నానా పాట్లు పడుతుంటారు. అయితే మందుల వరకు వెళ్లకుండా ఆహారంలో మార్పు చేసుకోవడం ద్వారా బి.పిని కంట్రోల్ చేసుకోవచ్చని ఇటీవల జరిపిన అధ్యయనంలో వెల్లడయింది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సోయా లేదా మిల్క్ ప్రొటీన్ బాగా ఉపయోగపడుతుందని శాస్త్రవ్తేల తాజా పరిశోధనల్లో వెల్లడయింది.

రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ల స్థానంలో సోయా లేదా మిల్క్ ప్రొటీన్ తీసుకుంటే హై బి.పి కి చెక్ పెట్టవచ్చని నిర్ధారణ అయింది. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ సప్లిమెంట్లు తీసుకున్న వారితో పోల్చితే మిల్క్ ప్రొటీన్ సప్లిమెంట్లు, సోయా ప్రొటీన్ సప్లిమెంట్లు తీసుకున్న వారిలో సిస్టోలిక్ బ్లడ్‌ప్రెషర్ తక్కువగా ఉన్నట్లు వెల్లడయింది. 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top