ధర్మాచార్యులైన భీష్మ,ద్రోణుల్ని శ్రీకృష్ణుడు యుద్ధంలో ఎందుకు పడగొట్టించాడు?

ఇది ఒక ధర్మసూక్ష్మానికి సంబంధించిన ప్రశ్న. అగ్ని సంభవ, పాండవ పట్ట మహిషి అయిన ద్రౌపదిని దుర్యోధనుని -నుపున దుశ్శాసనుడు జుట్టు బట్టి కౌరవ సభలోకి ఈడ్చుకు వచ్చాడు. అందరూ ఆమెను అనరాని మాటలని అవమానించారు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మన్నగు ధర్మవేత్తలంతా సభలో ఉన్నా ఎవ్వరూ ఈ అధర్మాన్ని ఆపలేకపోతున్నారే అని ద్రౌపది వలవల విలపించింది. అప్పుడు ధర్మాత్ముడైన విదురుడు ఇది ముమ్మాటికీ అధర్మమని చెప్పి, కౌరవులను హెచ్చరించాడు.

ఇక తప్పనిసరై, భీష్ముడు ఇలా అన్నాడు. 'అమ్మా! ద్రౌపదీ! ధర్మం చాలా సూక్ష్మమైనందువల్ల నీ విషయంలో నేనేమీ చెప్పలేకపోవుచున్నాను. ఓడిన ధర్మరాజు నీ భర్త. భార్యపై భర్తకెప్పుడూ అధికారముండును గదా! అందువల్ల నేనేమీ చెప్పలేకున్నాను' అని వూరుకున్నారు. ద్రోణుడు కూడ మిన్నకున్నాడు. అధర్మాన్ని చూస్తూ ఖండించక పోతే శిక్షార్హులే. పాపిష్ఠులే. ఈ కారణం వల్లనే, శ్రీకృష్ణుడు భీష్మ, ద్రోణులను రణరంగంలో పడగొట్టించాడు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top