ఇవి తింటే కాల్షియం పుష్కలం!

కాల్షియం లోపం కారణంగా సమస్యలు ఎదుర్కొనే వారిని మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో కనిపించే జాయింట్ పెయిన్స్, మహిళల్లో కనిపించే కీళ్లనొప్పులు, 40 దాటిన వారిలో తరచు కనిపించే ఎముకలు, కండరాల నొప్పులకు కాల్షియం లోపమే కారణం అంటున్నారు నిపుణులు. ఎముకలు క్షీణించడానికి కూడా ప్రధానం కారణం కాల్షియం లోపమే. అందుకే 40 ఏళ్లు దాటిన మహిళలు నిపుణుల సూచన మేరకు కాల్షియం మాత్రలు తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ తలెత్తవు. నిజానికి మనం నిత్య జీవితంతో తీసుకొనే ఆహార పదార్థాల్లో కాల్షియం పుష్కలంగా ఉండే పదార్థాలు అనేకం. చిన్నతనం నుంచీ మనం తినే తిండిలో ఆ ఆహారపదార్థాలను తగినంతగా తీసుకోగలిగితే ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవచ్చు. నిత్యజీవితంలో కాల్షియంపుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు ఏమిటో చూద్దాం. సమపాళ్లలో తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
  •   నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంది. పావుకప్పు నువ్వుల్లో 350 మిల్లీగ్రాముల కాల్షియం ఉంది. కాల్షియం వల్ల ఎముకల క్షీణత తగ్గుతుంది. మైగ్రైన్‌తలనొప్పి కాకుండా ఉండాలంటే తగినంత కాల్షియం అవసరం. ఇక కొలోన్ క్యాన్సర్ నివారణకు కాల్షియం కవచంలా పనిచేస్తుంది. నువ్వులు, బెల్లం కలిపి ఉండలుగా చేసుకుతింటే కాల్షియంతో పాటు శరీరానికి ఐరన్ కూడా పుష్కలంగా అందుతుంది.
  • పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంది. ఒక కప్ప పెరుగులో 450 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. పాలల్లో కూడా కాల్షియం అధికం. ఒక కప్పు పాలల్లో 300 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. పాలు తీసుకోని వారు పండ్ల, కూరగాయల ద్వారా తమకు అవసరమైన కాల్షియం తీసుకోవాలి. 5 కప్పుల పాలు లేదా పెరుగు తీసుకుంటే మనకు ఒక రోజుకు అవసరమైన కాల్షియం అందుతుంది.
  • పాలకూరలో కాల్షియం కావలసినంత ఉంటుంది. కాల్షియం ఉండడమే కాదు అనేక రకాల క్యాన్సర్‌లను నివారించే శక్తి పాలకూరలో ఉంది. గుండెరక్తనాళాలు మెరుగ్గా పనిచేయాలన్నా, ఉదరసంబంధమైన జబ్బులకు దూరంగా ఉండాలన్నా వారంలో మూడు సార్లయినా పాలకూర తీసుకోవాలి. చీజ్‌లో కూడా కాల్షియం దండిగా ఉంది. పాలకూరలో చీజ్ కలుపుకొని కూరగా చేసుకుని తింటే శరీరానికి అవసరమైన కాల్షియం సత్వరం అందుతుంది.

  • క్యాబేజీ వాసన చాలా మందికి పడదు. కానీ ఒక కప్పు క్యాబేజీలో 50 మిల్లీ గ్రామలు కాల్షియం ఉంది. క్యాబేజీని ఎక్కువగా ఫ్రైచేస్తే అందులోని పోషకవిలువలన్నీ పోతాయి. అందుకే దాన్ని ఒక మోస్తరగా ఉడకబెట్టి తింటే మంచిది.
  • నారింజ పండ్లలో కూడా కాల్షియం అధికంగా ఉంది. విటమిన్-సితో పాటు మనలో రోగ నిరోధకవ్యవస్థను పటిష్ఠం చేసే శక్తి కూడా నారింజ పండ్లకు ఉంది. దీనితో పాటు వెల్లుల్లిలో కాల్షియం అధికంగా ఉంది. మన శరీరంతో ఉండే బాక్టీరియాను నాశనం చేసే శక్తి, నొప్పులు తగ్గించే శక్తి కూడా వెల్లుల్లికి ఉంది. కాబట్టి మన ఇంట్లోనే ఉన్న పదార్థాల్లో నుంచి కాల్షియం అధికంగా ఉండే పదార్థాలు తీసుకొని ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకుంటారు కదూ?
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top