మామిడి ఫ్రైడ్‌ రైస్‌


కావల్సినవి:
బియ్యం - రెండుకప్పులు, మామిడిపండు ముక్కలు - నాలుగు కప్పులు, జీడిపప్పు - పావుకప్పు, కరివేపాకు - రెండురెబ్బలు, ఉప్పు - చెంచా, నెయ్యి - ఐదు చెంచాలు, ఆవాలు, జీలకర్ర - చెంచా చొప్పున, దాల్చిన చెక్క - చిన్నముక్క, యాలకులు - ఐదు, లవంగాలు - నాలుగు, పచ్చిమిర్చి - రెండు, కొబ్బరికోరు - రెండుచెంచాలు.
తయారీ: 

ముందుగా వెడల్పాటి గిన్నెలో నెయ్యి వేసి పొయ్యి మీద పెట్టి అది వేడయ్యాక లవంగాలు, మిర్చి, యాలకులు, దాల్చినచెక్క, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో కొబ్బరి కోరు వేయించి అందులోనే మూడుకప్పుల నీళ్లు, ఉప్పు తీసుకుని మరిగాక బియ్యం వేయాలి. కొద్దిసేపయ్యాక వేయించుకున్న సుగంధ దినుసులు, మామిడిముక్కలు చేర్చాలి. అన్నం పూర్తిగా ఉడికాక దింపేయాలి. ఇప్పుడు మరో పళ్లెంలోకి మార్చుకుని మామిడి ముక్కలు, జీడిపప్పుతో అలంకరించుకొంటే సరిపోతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top