రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర విటమిన్ సి శరీరానికి అందడం ఎలా?

రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో విటమిన్ సి కీలకపాత్ర పోషిస్తుంది. సి విటమిన్ బాగా అందించే నిమ్మపండు జ్యూస్ వర్షాకాలంలో తాగాలంటే కష్టంగా అనిపిస్తుంది. మరి, చాలా ముఖ్యమైన విటమిన్ సి శరీరానికి అందడం ఎలా? అందుకు చాలా మార్గాలున్నాయంటున్నారు నిపుణులు. ఈపచ్చబఠాణీ గింజల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు బఠాణీలో 23 మిల్లీగ్రాముల విటమిన్ ఉంటుంది. విటమిన్ సి డిఎన్ఎ దెబ్బతినకుండా, కణనిర్మాణాన్ని పరిరక్షిస్తుంది. వాతావరణ కాలుష్యం నుంచి మనల్ని మనం కాపాడుకొనేందుకు, రసాయనాల ప్రభావం నుంచి బయటపడేందుకు విటమిన్ సి చాలా అవసరం. ఈపాలకూరలో కాల్షియంతో పాటు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు పాలకూరలో 18 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. నొప్పులు తగ్గించడంతో పాటు క్యాన్సర్‌ను దూరంగా ఉంచే గొప్ప లక్షణం పాలకూరలో ఉంది.

ఈఒక కప్పు పుచ్చపండులో 15 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంది. ఇందులోని విటమిన్ సి కీలకమైన యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిఉంది. ఈపచ్చటి బీన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక కప్పు ఉడికించిన బీన్స్‌లో 12 మిల్లీ గ్రామల విటమిన్ సి ఉంది. ఎముకల పుష్టికి బీన్స్ చాలా మంచిది. సిలికాన్, విటమిన్ ఎ, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి కీలక ధాతువులు బీన్స్‌లో ఉంటాయి.

ఈబంగాళదుంపను చూడగానే చాలా మంది ముఖం పక్కుకు తిప్పుకుంటారు. అజీర్తి చేస్తుందంటారు మరికొందరు. నిజానికి ఉడికించిన బంగాళదుంపల్లో 16 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఆలుగడ్డలకు పై తోలు వలిచేసి తింటాం. కానీ అది ఆరోగ్యానికి చాలా మంచిది. పైతోలుతో సహా ఆలుగడ్డలను ఎక్కువ నూనెలేకుండా తింటే విటమిన్ సి తో పాటు విటమిన్ బి6, కాపర్, పొటాషియం, మాంగనీస్, ఫైబర్ కూడా శరీరానికి అందుతాయి. ఈఒక కప్పు పచ్చి క్యారెట్‌లో 11 గ్రాముల విటమిన్ సి ఉంటుంది. కెరొటనాయిడ్స్ అధికంగా ఉండే క్యారెట్ వల్ల గుండెరక్తనాళాలకు సంబంధించిన జబ్బులను దూరంగా ఉంచవచ్చు. మెరుగైన కంటి చూపునకు క్యారెట్‌లు తినడం చాలా అవసరం.



ఈఅరటి పండులో కాల్షియంతో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. క్రీడాకారులకు అవసరమైన పొటాషియం కూడా ఇందులో ఉంది. వేగంగా శక్తినిచ్చే లక్షణం కూడా అరటి పండులో ఉంది. కాబట్టి వర్షాకాలంలో పైన చెప్పకున్న వాటిని తినడం ద్వారా విటమిన్-సి ని పెంచుకొని, జబ్బులను ఆమడదూరంలో ఉంచుదాం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top