బ్రెడ్‌ రసగుల్లా

కావల్సినవి:
బ్రెడ్‌ప్యాకెట్‌- ఒకటి, పంచదార - రెండు కప్పులు, నెయ్యి- పావుకప్పు, యాలకుల పొడి- చెంచా;
తయారీ:

బ్రెడ్‌ ముక్కల అంచులు తొలగించి.. వాటిపై కాసిని నీళ్లు పోయాలి. ఆ తరవాత మెత్తగా చేసి పక్కనపెట్టాలి. అరగంటయ్యాక అందులో యాలకుల పొడి కలిపి ఉండలు చేసుకోవాలి. పెనంపై నెయ్యిని కరిగించి ఆ ఉండల్ని దోరగా కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి అడుగున్న గిన్నెలో పంచదార తీసుకొని తగినన్ని నీళ్లు కలిపి పొయ్యి మీదపెట్టాలి. పాకం సిద్ధమయ్యాక అందులో సిద్ధం చేసి పెట్టుకున్న ఉండల్ని వేస్తే బ్రెడ్‌ రసగుల్లా సిద్ధమయినట్టే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top