చాకొలెట్లలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని, అవి తినడం వల్ల గుండెసంబంధిత వ్యాధుల బారినపడకుండా ఉండొచ్చని చెపుతుంటారు. ఈ మధ్యన చాకొలెట్లకి సంబంధించి మరో విషయాన్ని కూడా కనుగొన్నారు పరిశోధకులు. అదేంటంటే వ్యాయామం చేసే శక్తిని పెంచడంలో చాకొలెట్లది కీలక పాత్ర అట. ఆహా! ఏమి భాగ్యం. . . ఒక పక్క చాకొలెట్లు తింటూ మరో పక్క వ్యాయామం చేయొచ్చని చాకొలెట్ ప్రియులు తెగ సంబరపడుతున్నారు కదూ.
కాస్త ఆగండి. తినమన్నారు కదాని ఇష్టమొచ్చినన్ని చాకొలెట్లు తినడానికి వీల్లేదు. రోజుకి ఒక చిన్న బైట్ చాకొలెట్ అయితేనే మీరు చేసే వ్యాయామానికి తగిన ఫలితం ఉంటుందట. అలాగే వ్యాయామం చేసిన తరువాత చాకొలెట్ పాలు తాగితే నీరసం మాయమవుతుందని కూడా అంటున్నారు వాళ్లు. వీటిలో కూడా డార్క్ చాకొలెట్ తింటే రక్తపీడనంలో సానుకూల మార్పు గమనించొచ్చట. కాకపోతే కాస్త చేదు ఎక్కువ. ఇకనుంచి చిన్న ముక్క చాకొలెట్ కొరికి వ్యాయామం మొదలుపెట్టండి. ఫలితాన్ని ఎంజాయ్ చేయండి.