బరువు తగ్గాలంటే..?


ఆధునిక వేగవంతమైన జీవన విధానంలో రోజురోజుకు మారిపోతున్న జీవన శైలిలో ఎక్కువమందిని పట్టి పీడిస్తున్న సమస్య బరువు తగ్గడమెలా? మగవారి కంటే ఆడవారు ఈ మధ్య లావెక్కి పోయామని బాధ పడుతూ బరువు తగ్గించుకోటానికి అనేక పాట్లు పడుతున్నారు. చివరికి డాక్టర్ల చుట్టూ తిరగటం నిత్యం చూస్తున్నదే.
 

పాత కాలంలో ఇంట్లో ఆడవాళ్లు కష్టపడి పనిచేసేవారు. కానీ, నేడు పిల్లలు మొదలు పెద్దవాళ్ల వరకూ తిండి తినడానికి సమయం లేదు. మగవాళ్లు ఆఫీసుకి హడావిడిగా వెళ్లటం.. ఆడవాళ్లకు టీవీలో సీరియళ్ల హడావిడి, పిల్లలకు బడి కంగారు. ఈ పరుగుల జీవన విధానంలో కడుపునిండా తిండి తినటానికే సమయం లేదు. కొద్దిపాటి బరువు పెరగగానే ఇక ఎలా బరువు తగ్గి సన్నబడాలా అని ప్రయత్నాలు మొదలెడతారు.
 

వంశపారంపర్యంగా వచ్చే స్థూలకాయంతోపాటు నిత్య జీవన విధానంలో ఆహారపు టలవాట్లు మొదలైన వాటివల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఆహారం లేకుండా బతకలేం. అలాగని ఆహారం ఎక్కువైనా బతకలేం. అందుకే ఏ ఆహారం తినాలి? ఎంత తినాలన్నది సమస్యగా మారింది. తక్కువ తింటే నీరసం ఎక్కువ తింటే ఆయాసం. ఆహారం గురించిన పూర్తి అవగాహన లేకపోవటమే ఇందుకు కారణం. 
గుండె బలం కోసం ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి. చికెన్, మటన్, జీడిపప్పు తింటే కానీ బలం రాదన్న అపోహలు పోవాలి. జీడిపప్పులో ఎంత పోషక విలువలు ఉన్నాయో అంత పోషక విలువలు వేరుసెనగ పప్పులో ఉన్నాయి. చికెన్ కంటే ఎక్కువ మాంసకృత్తులు పప్పు ధాన్యాల్లో లభిస్తాయి. బరువు తగ్గాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా వ్యాయామం చేస్తూ సమతుల పోషకాహారం తీసుకోవాలి. కేవలం డైటింగ్ చేయడంవల్ల శరీరంలో కొవ్వు, రక్తంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ విధమైన ఆహారం తినాలన్న విషయం గురించి ఇలా వివరించింది. ఆహారంలో ఎక్కువ కూరగాయలు, పళ్లు, కార్బోహైడ్రేట్స్ ఉండాలి. కొవ్వు, తీపి పదార్థాలు, ఉప్పు దాదాపుగా తగ్గించాలి. కొవ్వు పదార్థాలు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. బిస్కెట్లు, కేక్‌ల బదులు తాజా పళ్లు, చిక్కటి పాలకు బదులు వెన్న తీసిన పాలు, చిక్కటి పెరుగుకు బదులు పల్చటి మజ్జిగ, టీ కాఫీలకు బదులు కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవటం అన్నది బరువు తగ్గటానికి కీలకమైన విషయాలు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top