మార్నింగ్ వాక్ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

సాధారణ చెప్పులు, హీల్స్‌కు బదులు బూట్లు ఎంచుకోవాలి. అప్పుడే సౌకర్యంగా పరుగెత్తగలుగుతాం. బూట్లు కూడా వాటి అడుగు భాగం గట్టిగా లేకుండా చూసుకోవాలి. లేదంటే అరికాళ్లలో ఒత్తిడి తప్పదు. కాళ్లనొప్పులు బాధించవచ్చు.

దుస్తుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా లోదుస్తులు సౌకర్యంగా ఉండాలి. మిగతావి వదులుగా ఉంటే చెమటను పీల్చుకుంటాయి. మీకూ ఇబ్బంది అనిపించదు.

ఎక్కువ సమయం అదేపనిగా పరుగెత్తడం వల్ల శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. అందుకే మధ్యలో మూడు నాలుగు నిమిషాలు విరామం తీసుకోవడం మంచిది. అలానే మంచినీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. వేగంగా పరుగెత్తడం వల్ల ఎక్కువ చెమట పడుతుంది. అలాంటప్పుడు మంచినీళ్లు సక్రమంగా తీసుకోకపోతే డీహైడ్రేషన్‌ సమస్య తప్పదు. పరిగెత్తడం పూర్తయ్యాక ఎక్కువగా నీళ్లు తాగాలి. ఆకలిగా ఉందని.. నీరసంగా అనిపిస్తుందని వెంటనే ఏదో ఒకటి తినడం సరికాదు. అలా అనిపించినప్పుడు గ్లూకోజ్‌ నీళ్లకు ప్రాధాన్యమివ్వాలి. గంటతరవాత అల్పాహారం తీసుకొంటే సరిపోతుంది.

సాయంత్రాలు ఓ పదినిమిషాలు పాదరక్షలు వదిలి పచ్చనిగడ్డిపై పరిగెత్తడం వల్ల పాదాల్లోని రక్తకణాలు ఉత్తేజితమవుతాయి. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఈ ప్రభావం మెదడు మీద పడి ఒత్తిడి దూరమవుతుంది. ఇలా వారానికోసారి చేయడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది.

ఉదయాన్నే వెళ్తున్నప్పుడు చల్లగాలివల్ల జలుబు వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే చెవుల్లో దూది పెట్టుకోవడం మంచిది.
కీళ్లనొప్పులు, పాదాల సమస్యలు బాధించేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవడం తప్పనిసరి. అలానే గాయాలు, దెబ్బలు తగినప్పుడు వాటి నుంచి పూర్తి ఉపశమనం కలిగిందని నిర్ధారించుకున్నాకే పరుగు పెట్టాలి. లేదంటే సమస్యలు మళ్లీ మొదటికొస్తాయి.
  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top