మోచేతులు మెరిసేలా...ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి.

  •  నిద్రించే ముందు మోచేతులకు మందంగా పెట్రోలియం జెల్లీని పట్టించండి. ఆ మర్నాడు సబ్బుతో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మార్పు ఉంటుంది.
  • స్నానం చేసే ముందు నిమ్మచెక్కను రుద్దుకోవాలి. పొడిబారి, బరకగా మారిన మోచేతులు కోమలంగా మారతాయి.
  • బరకగా మారిన మోచేతులకు కొద్దిగా ఆలివ్‌నూనె రాసి మర్దన చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మార్పు ఉంటుంది.
  • మోచేతులు పొడిబారి దురద కూడా బాధిస్తుంటే.. స్నానం చేసేందుకు ఇరవై నిమిషాల ముందు ఆ ప్రాంతంలో కొద్దిగా వెన్న రాసి.. ఆ తరవాత నలుగు పెట్టి రుద్దుకోండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top